Aryana Sayeed:పాక్ అండతోనే తాలిబ‌న్ల‌ అరాచకాలు..అఫ్గాన్ దుస్థితికి పాకిస్థానే కారణం

అప్గానిస్తాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకోవటాని పాకిస్థానే కారణమని..తాలిబ‌న్ల‌ను పాకిస్థాన్‌ ప్రోత్స‌హిస్తోందని అఫ్గాన్ పాప్ స్టార్ అర్యానా స‌యీద్ అన్నారు.

Aryana Sayeed:పాక్ అండతోనే తాలిబ‌న్ల‌ అరాచకాలు..అఫ్గాన్ దుస్థితికి పాకిస్థానే కారణం

Afghanistan Pop Sta Aryana Sayeed

Afghanistan pop sta Aryana Sayeed : అఫ్ఘాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు అరాచకాలకు తెరతీశారు. మహిళల హక్కుల్ని కాలరాస్తున్నారు. ఇల్లు కదలటానికి వీల్లేదని ఆంక్షలు విధించటంతో గడప దాటడానికే యువతులు, మహిళలు హడలిపోతున్నారు. తాలిబన్లు పీడ విరగడ అయిన గత 20 నాటినుంచి అఫ్గాన్ మహిళలు కాస్త మనుష్యుల్లా జీవిస్తున్నారు. కానీ మరోసారి తాలిబన్లు అఫ్గాన్ పై పట్టు సాధించటంతో తిరిగి అదే దుస్థితికి నెట్టివేయపడుతున్నారు మహిళలు. కొంతమంది విదేశాలకు వెళ్లిపోతున్నారు. మహిళా సెలబ్రిటీలు కూడా తాలిబన్ల అరాచకాలకు తలవంచాల్సిన పరిస్థితి నెలకొంది అఫ్గాన్ లో.

ఈక్రమంలో తాలిబన్ల బెదిరింపులతో ఆఫ్ఘ‌నిస్తాన్‌కు చెందిన పాప్ స్టార్ అర్యానా స‌యీద్ దేశం విడిచి వెళ్లిపోయిన పరిస్థితి. అలా దేశ విడికి వెళ్లిపోయిన అర్యానా ఖ‌తార్‌లోని దోహాకు చేరుకుని అక్క‌డ నుంచి టర్కీలోని ఇస్తాంబుల్‌కు వెళ్లి ఆమె తెలిపారు. ఈ సందర్భంగా అర్యానా మాట్లాడుతూ..తాలిబన్ల్ అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయని పక్క దేశమైన పాకిస్థాన్ అండతోనే తాలిబన్లు అరాచకాలకు పాల్పడుతున్నారని ప్రస్తుత ఆఫ్గాన్ దేశ దుస్థితికి పాకిస్థానే కారణమని ఆమె ఆరోపించారు. తాలిబ‌న్ల‌కు పాకిస్థాన్ అండ‌గా నిలుస్తోంద‌ని..దానికి సంబంధించిన వీడియోలు, ఆధారాలు చాలా ఉన్న‌ాయని అర్యానా వెల్లడించారు.

ఒక తాలిబ్‌ను ప‌ట్టుకుంటే..పాకిస్థాన్ గుట్టు బయటపడుతుందని ఆ తాలిబన్ ఐడెంటిటీ పాకిస్థాన్‌కు చెందే ఉంటుందని అర్యానా స్పష్టంచేశారు. ప్రస్తుతం అఫ్గాన్ దేశం దుర్భర పరిస్థితుల్లో చిక్కుకుందని తాలిబన్ల అరాయచాలు.అఘాయిత్యాలు,అత్యాచారాలతో అఫ్గాన్ మహిళలు తల్లడిల్లిపోతోందని అటువంటి పరిస్థితుల నుంచి తాను బయటపడినందుకు అఫ్గాన్ ను విడిచి వచ్చిందనందుకు సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.

తనలాంటివారు అటువంటి దురాగతాల నుంచి తప్పించుకున్నాం కానీ..అక్క‌డ ఉన్న మ‌హిళ‌ల ప‌రిస్థితి అత్యంత దారుణంగా ఉందని వారి జీవితాలు ఎలా ఉంటాయో ఊహించటానికి కూడా భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు పాప్ స్టార్ అర్యానా తెలిపారు. 20 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు మళ్లీ అక్కడ కనిపిస్తున్నాయని ఇవి అత్యంత బాధాక‌ర‌మూనవనీ…పాత గాయాలు మళ్లీ రాజుకుంటున్నాయని అనాటి ప‌రిస్థితులే మ‌ళ్లీ ఉత్ప‌న్నం అవుతున్నాయ‌ని అఆమె అన్నారు.

యువతులు, మ‌హిళ‌లు ఇళ్లకే ప‌రిమితం అయిపోతున్నారు. బాలికలు స్కూలుకు వెళ్లే పరిస్థితి కూడా ఉండదని..మహిళల్ని సాటి మనుషుల్లా కూడా చూడని వారి ప్రాథ‌మిక హ‌క్కుల్ని కాల‌రాస్తున్నార‌న్నారని ఆర్యానా ఆవేదన వ్యక్తంచేశారు. అఫ్ఘ‌ానిస్తాన్‌ను తాలిబ‌న్ల చేతుల్లోనే వ‌దిలేస్తే..ఇక అఫ్ఘ‌ాన్ మ‌హిళ‌ల‌కు భ‌విష్య‌త్తే ఉండదని అన్నారు.

కేవ‌లం కొన్ని రోజుల్లోనే యావ‌త్ ఆఫ్గాన్ ను తాలిబ‌న్లు హస్తగతం చేసుకోవటం ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన విషయం అనీ..దీనికి పాకిస్థాన్ హస్తం ఉందని పాప్‌స్టార్ ఆర్యానా తెలిపారు. ఆల్‌ఖ‌యిదా, తాలిబ‌న్ల‌ను అంతం చేస్తామ‌ని అగ్ర‌దేశాలు 20 ఏళ్ల క్రితం ఆఫ్గ‌న్ వ‌చ్చాయి. కానీ ఇప్పుడు త‌మ దేశాన్ని వ‌దిలి వెళ్ల‌డం బాధ క‌లిగిస్తోంద‌ని అమెరికాను ఉద్ధేశించి అన్నారామె. అంత‌ర్జాతీయ దేశాలు ఆఫ్ఘ‌న్‌లో శాంత స్థాప‌న కోసం ప్ర‌య‌త్నాలు చేయాల‌ని ఆమె కోరారు. అఫ్ఘ‌ాన్ రాజ‌కీయాల్లో పాక్ జోక్యం చేసుకోకూడ‌ద‌ని..భార‌త్ ఎల్లప్పుడూ అప్గాన్ కు అండగా ఉందని..భారతే అప్గాన్ కు నిజమైన మిత్ర దేశమని అన్నారు. భారతీయులే అఫ్గాన్ కు నిజ‌మైన స్నేహితుల‌ు అని ఆర్యానా అన్నారు. అఫ్గాన శ‌ర‌ణార్థుల విషయంలో భారత్ ప్రేమాభిమానాలతో ఉందని..శరణార్ధులను ద‌య‌ ఆదరిస్తోందని అఫ్గాన్ పాప్ స్టార్ ఆర్యానా అన్నారు.