Ashraf Ghani : తజికిస్తాన్ పారిపోయిన అప్ఘాన్ అధ్యక్షుడు

తాలిబన్లతో పోరాడలేక అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అష్రఫ్ ఘనీ.. తజికిస్తాన్ కి పారిపోయినట్లు సమాచారం.

Ashraf Ghani : తజికిస్తాన్ పారిపోయిన అప్ఘాన్ అధ్యక్షుడు

Ashraf (2)

Ashraf Ghani  ఆదివారం ఉదయం తాలిబన్లు రాజధాని కాబుల్ నగరంలోకి ప్రవేశించిన నేపథ్యంలో అఫ్ఘానిస్తాన్ అధ్యక్ష పదవికి అష్రఫ్ ఘని రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాలిబన్లతో పోరాడలేక అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అష్రఫ్ ఘనీ.. తజికిస్తాన్ కి పారిపోయినట్లు సమాచారం.

అష్రఫ్ ఘని.. తన ముఖ్యమైన టీంతో కలిసి త‌జ‌ికిస్తాన్ వెళ్లిన‌ట్లు అప్ఘాన్ అంత‌ర్గ‌త మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే భద్రతా కారణాల రీత్యా అష్రఫ్ ఘనీ కదిలికలపై ఎలాంటి వ్యాఖ్య చేయలేమని అఫ్ఘాన్ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. అయితే ఘనీ ఎక్కడ ఉన్నాడో వెతికే ప్రయత్నంలో ఉన్నట్లు తాలిబన్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

అంత‌కుముందు కాబూల్‌లోకి దూసుకొచ్చిన తాలిబ‌న్లకు వాళ్ల నాయ‌కత్వం.. ఎలాంటి హింస‌కు పాల్ప‌డొద్ద‌ని ఆదేశాలు జారీ చేసింది. ఆ త‌ర్వాత అధ్యక్ష భ‌వ‌నానికి వెళ్లి చ‌ర్చ‌లు జ‌రిపారు. శాంతియుతంగా తాలిబన్లకు అధికారం బ‌దిలీ చేస్తామ‌ని అప్ఘానిస్తాన్ మంత్రి కూడా వెల్ల‌డించారు. మరికొద్ది గంటల్లో అప్ఘానిస్తాన్ లో మధ్యంతర తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటు కానుందని..53ఏళ్ల తాలిబన్ కమాండర్ ముల్లా బరాదర్ అప్ఘాన్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తారని సమాచారం.

READ Taliban : అఫ్ఘానిస్తాన్ కొత్త అధ్యక్షుడిగా తాలిబన్ నేత ముల్లా బరాదర్!

READ Taliban : అసలు ఎవరీ తాలిబన్లు..వీళ్ల లక్ష్యం ఏంటీ!