పాము-ఎలుక ’లిప్ కిస్’..! వైరల్ ఫోటో

పాము-ఎలుక ’లిప్ కిస్’..! వైరల్ ఫోటో

After lip kissing rat killed snake  : పాముకు ఎలుక కంటపడిందంటే చట్టుక్కున పట్టేసుకుని లటుక్కున మింగేస్తది. కానీ.. ఓ పాము-ఓ ఎలుక ముద్దు పెట్టుకున్నాయి. కానీ ఇది ఎవ్వరూ నమ్మరు. కానీ నిజమే..నీలీ నీలీ ఆకాశం రంగులో మెరిసిపోతున్న ఓ పాము-ఎలుక ముద్దు పెట్టుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది గ్రాఫిక్ కాదు నిజమే..ఇండోనేసియాలోని బెకాసీ అడవుల్లో.. చోటుచేసుకున్న ఈ అరుదైన దృశ్యాన్ని ఓ వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్ తన కెమెరాతో క్లిక్ మంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటోను చూసినవాళ్లు…ఏంటీ ఎలుక తన చిట్టి బుర్రని బీరువాలో పెట్టి వచ్చిందా? ఏంటీ? పాముతో ముద్దులాటలేంటీ..లటుక్కున నోట్లో వేసుకుంటుందనే భయం లేదా?అంటూ నోరెళ్లబెడుతున్నారు..!


అవి ఇండోనేసియాలోని అందానికి ప్రతి రూపమైన బెకాసీ అడవులు. ఆ అడవుల్లో నీలిరంగులో మెరిసిపోతున్న ఓ అందమైన పాము.. ఓ చెట్టు ఊడపై చుట్టగా చుట్టుకుని ఉంది. అక్కడకు ఓ ఎలుక వచ్చింది. మాంచి కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్న పాముని చూసింది. ‘‘నీలి నీలీ ఆకాశంలా ఎంత అందంగా ఉందో..అంటూ తెగ మురిసిపోయింది. ఎగురు కుంటూ..ఆ పాము దగ్గరగా వచ్చింది. కళ్లు చిత్రంగా తిప్పింది.

ఆ పాముని వదిలి వెళ్లాలనిపించలేదేమో ఆ చిట్టి ఎలుకకు..పాము నోటి దాకా వచ్చింది.. అక్కడితో ఆగలేదా తుంటరి ఎలుక పాము అందానికి ఫిదా అయిపోయిందో ఏమోగానీ.. ఓ ‘లిప్ కిస్’కూడా ఇచ్చింది…!! ఈ అరుదైన దృశ్యం ఓ వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్ కంటిలో పడింది..మరి అతను ఊరుకుంటాడా? ఇటువంటి దృశ్యాన్ని వదులుతాడా? ఏంటీ..టక్కుమని క్లిక్ మనిపించాడు. ఆ తరువాతే జరిగాల్సిందంతా జరిగింది..!!


ఎంత అందంగా కనిపిస్తే మాత్రం మరీ..ఇలా డైరెక్టుగా వెళ్లి ముద్దులిచ్చేయడమేనా..అందంగా ఉన్నాగానీ..అదో పాము దానికి ఆహారంగా అవటానికే నేను పుట్టాననే మాట మరచిపోయి రొమాన్స్ చేద్దామనుకున్న ఆ ఎలుకగారి పరిస్థితిని ఒక్కసారి ఊహించండి చూద్దాం…హా..మీరు ఊహించిందే జరిగింది…తన అందంతో ఎలుకకు వల వేసిన ఆ పాము ఆ ఎలుక దగ్గరగా వచ్చి వెధవ్వేషాలు వేయటంతో లటుక్కుని పట్టేసుకుని గుట్టుక్కుమనిపించింది..చచ్చార్రా బాబోయ్..అని ఎలుక అనుకునేలోపు జరగాల్సిన అనర్థం జరిగిపోయింది..అంతేమరి ఆపదలు అందంగానే ఉంటాయని తెలుసుకోకపోతే ఎలా?..

ఇవన్నీ ఆలోచిస్తేగా..ఆ ఎలుక? అందుకే ఊరికే అన్నామా ‘బుర్రను బీరువాలో పెట్టి వచ్చిందని’.. ఆలోచించుకునే గ్యాప్ కూడా లేకుండా ఆ నీలి నీలి ఆకాశం రంగులో మెరిసిపోయే పాము ఆ ఎలుకను గుటుక్కుమనిపించేసింది…ఎలుక సార్‌వారు పాముకు ఆహారం అయిపోయు..స్వర్గస్తులైనారు..అల్‌రెడీ కొన్ని రోజులు కూడా అయిపోయింది..!!పాము ఎలుకపై ఎటాక్ చేసే దృశ్యాన్ని కూడా సదరు ఫోటో గ్రాఫర్ క్లిక్ మనిపించటంతో ఎలుకగారి కథ అలా ముగిసిపోయినట్లుగా తెలిసింది..