Bharath-china : భూటాన్ లో చైనా గ్రామాల నిర్మాణం..భారత్ పై కుట్రలకు సంకేతమా?

ఈశాన్య రాష్ట్రాలను భారత్‌లోని మిగతా భూభాగంతో అనుసంధానించేది సిలిగురి కారిడారే ! భారత్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా కుట్రలు పాల్పడుతున్న చైనా... భారత్‌పై ట్రిగ్గర్ గురిపెట్టేందుకు ఉన్న మార్గాలన్నింటిపైనా ఫోకస్‌ పెంచుతోంది.

Bharath-china : భూటాన్ లో చైనా గ్రామాల నిర్మాణం..భారత్ పై కుట్రలకు సంకేతమా?

Chinese Villages In Bhutan's Doklam Now Fully Occupied (1)

Bharath-china : భూటాన్‌లో గ్రామం నిర్మిస్తుంటే.. భూటాన్ మాత్రం సైలెంట్‌గా ఉంది. పాంగ్డా విలేజ్ గురించి వివరించేందుకు కూడా ఆ దేశ ప్రతినిధి ఆసక్తి చూపించలేదు. దీంతో కొత్త అనుమానాలు తావిస్తున్నాయ్. ఇంతకీ డోక్లాంనే చైనా ఎందుకు టార్గెట్ చేసింది. భారత్‌ మీద ఎలాంటి దొంగ వ్యూహాలతో ముందుకు వెళ్తోంది..

భూటాన్ భూభాగంలో చైనా గ్రామాన్ని నిర్మించడం.. సామాన్యులను కూడా తరలించడంతో ఇప్పుడు కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. నిజానికి సరిహద్దుల విషయంలో భూటాన్‌తోనూ చైనాకు విభేధాలు ఉన్నాయ్. ఐతే గతేడాది అక్టోబర్‌లో రెండు దేశాలు ఓ ఒప్పంద కుదుర్చుకున్నాయ్. దీంతో ఇప్పుడు భూటాన్ వ్యవహారంపై కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయ్. పాంగ్డా గ్రామం వ్యవహారంపై వివరణ కోరగా.. ఢిల్లీలోని భూటాన్ ప్రతినిధి సరిగా స్పందించకపోవడం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. నయానో, భయానో పక్క దేశాలను చైనా గుప్పిట్లో పెట్టుకొని ఇండియా వైపు దూసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నా.. భారత్ మాత్రం ఎప్పటికప్పుడు డ్రాగన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది.

డోక్లామ్ పీఠభూమికి చేరుకోవటానికి ఏకంగా పది కిలోమీటర్ల రోడ్డును వేసేసింది చైనా. మన భూభాగాలను అక్రమిస్తు మరోవైపు గ్రామాలకు గ్రామాలనే నిర్మిస్తోంది. డోక్లాం ప్రాంతంలోని జంపేరి పర్వతం దగ్గరకు సులభంగా చేరుకోవటానికి వీలుగా రోడ్లను వేయాలనేది డ్రాగన్ ప్లాన్. ఇందులో భాగంగానే పర్వతం చుట్టుపక్కల ప్రాంతాలను ఆక్రమించి రోడ్లను వేసేస్తోంది. ఒకసారి జంపేరి పర్వతాన్ని చైనా ఆక్రమించుకుంటే భారత్‌కు ఇబ్బందులు తప్పవు. ఈ నిర్మాణాల ద్వారా డోక్లామ్ పీఠభూమిలోని వ్యూహాత్మక భాగాలపై పట్టు సంపాదించేందుకు చైనా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. భారత్‌కు చెందిన సున్నితమైన సిలిగురి కారిడార్, సిక్కింకు చైనా బలగాలు చేరుకోవడానికి ఈ కొత్త గ్రామాల మీదుగా వెళ్లే మార్గం ఉపయోగపడే ప్రమాదం ఉంది.

Also read : China : భూటాన్‌ అడ్డు పెట్టుకొని చైనా అరాచకాలు..డోక్లాం వద్ద గ్రామాల నిర్మాణం..సిలిగురి కారిడార్‌పై డ్రాగన్ కన్ను!

ఈశాన్య రాష్ట్రాలను భారత్‌లోని మిగతా భూభాగంతో అనుసంధానించేది సిలిగురి కారిడారే ! భారత్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా కుట్రలు పాల్పడుతున్న చైనా… భారత్‌పై ట్రిగ్గర్ గురిపెట్టేందుకు ఉన్న మార్గాలన్నింటిపైనా ఫోకస్‌ పెంచుతోంది. భారత్‌ను ఓవైపు కవ్విస్తూనే మరోవైపు యుద్ధం అంటూ వస్తే భారత్‌ సైన్యాన్ని ఎదుర్కొనేందుకున్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. డోక్లాం సమీపంలో గ్రామం నిర్మిస్తోంది కూడా అందుకే ! ప్రస్తుతానికి పాంగ్డా గ్రామంలో ఉన్న చైనా పౌరులే అయినా.. భవిష్యత్‌లో అక్కడికి సైన్యాన్ని దించుతుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయ్.ఐతే డోక్లాం దగ్గర చైనా కార్యక‌లాపాల‌పై ఆందోళన అవసరం లేదని.. అవసరమైన నిఘా పెంచామ‌ని భారత్ అంటోంది. జాతీయ భ‌ద్రత‌కు ముప్పు క‌లిగించే ప‌రిణామాల‌ను చూస్తూ ఊరుకోమని.. అలాంటి వాటిని ఎప్పటిక‌ప్పుడు ప‌సిగ‌డుతున్నామ‌ని చెప్తోంది.

గ్రామం నిర్మించి చైనా ఊరుకుందా అంటే.. అంతకుమించి ఓవరాక్షన్ చేస్తోంది. ఎలాంటి సైనిక కార్యకలాపాలు నిర్వహించకూడదనే ఒప్పందం ఉన్న గ్రే జోన్‌లో యుద్ధవిమానాలతో విన్యాసాలు, ఆపరేషన్లు నిర్వహిస్తోంది. అధునాతన మల్టిపుల్‌ రాకెట్‌ లాంచర్‌ వ్యవస్థను మోహరిస్తోంది. ఈ ఆయుధాల రేంజ్‌ మోసుకెళ్లే క్షిపణుల బరువు, మోడల్‌ ఆధారంగా 350 నుంచి 5 వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది. చైనా తన బలప్రదర్శన కోసమే వీటిని సరిహద్దుల్లో పరీక్షించినట్లు తెలుస్తోంది. ఈ క్షిపణులతో భారత్‌ కీలక స్థావరాలను విధ్వంసం చేయొచ్చన్నది చైనా అధికారుల దగుల్బాజీ అంచనా.

సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు పాల్పడుతూ.. యుద్ధానికి కాలు దువ్వుతున్న చైనా.. ఆ ప్లాన్‌ను ఆచరణలో పెట్టే ఆలోచనలో ఉంది. ఇప్పటికిప్పుడు యుద్ధం వచ్చినా.. భారత్ మీద పట్టు సాధించాలన్న బుద్ధితో దొంగ గ్రామాలు నిర్మిస్తోంది. ఐతే భారత్‌ కూడా అప్రమత్తంగానే ఉంది. మౌనంగా ఉంటుంది అంటే.. పట్టించుకోనట్లు కాదు.. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు. ఇప్పుడు ఇండియా చేస్తోంది కూడా అదే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.