Air India: హజ్ యాత్రకు ప్రత్యేక విమానాలను నడపనున్న ఎయిర్ ఇండియా

విమానాలను జూన్ 4 నుంచి 22వ తేదీ వరకు కోజికోడ్, కన్నూర్ నుంచి నడపనుంది. ఇది కోజికోడ్ నుంచి జెడ్డాకు 44 విమానాలను, కన్నూర్, జెడ్డా మధ్య 13 విమానాలను నడపనున్నట్లు పేర్కొంది. రెండవ దశలో 13 జూలై నుంచి ఆగస్టు 2 మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ యాత్రికులను మదీనా నుంచి కోజికోడ్, కన్నూర్‌లకు తిరిగి తీసుకొస్తుంది.

Air India: హజ్ యాత్రకు ప్రత్యేక విమానాలను నడపనున్న ఎయిర్ ఇండియా

Hajj Yatra: భారతదేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియా.. భారతదేశంలోని నాలుగు నగరాల నుంచి సౌదీ అరేబియాలోని జెద్దా, మదీనాకు దాదాపు 19,000 మంది హజ్ యాత్రికులను చేరవేయనున్నాయి. ఇందుకోసం ప్రత్యేక విమానాలను నడపనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ సంవత్సరం హజ్ కార్యకలాపాలలో భాగంగా మొదటి ఎయిర్ ఇండియా విమానం ఆదివారం జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరింది.

Karnataka Politics: కర్ణాటక అసెంబ్లీని గోమూత్రంతో శుభ్రం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు.. డీకే ఆదేశాల మేరకే ఇలా చేశారట

మొదటి దశ కార్యకలాపాల సమయంలో 21 మే నుంచి 21 జూన్ మధ్య జైపూర్, చెన్నై నుంచి మదీనా, జెద్దాలకు వరుసగా 46 విమానాలను ఎయిర్ ఇండియా నడుపునుంది. రెండవ దశలో యాత్రికులను జెద్దా, మదీనా నుంచి జైపూర్, చెన్నై వరకు 3 జూలై నుండి 2 ఆగస్టు మధ్య 43 విమానాలను నడుపనుంది. మొత్తం మీద ఎయిర్ ఇండియా తన బోయింగ్ 787, ఎయిర్‌బస్ 321నియో విమానాలతో సౌదీ అరేబియాకు మొత్తం 10,318 మంది ప్రయాణికులను చేరవేయనుంది.

Revanth Reddy : జంట నగరాలపై అణుబాంబే, హైదరాబాద్‌లో వేలాది మంది చనిపోయే పరిస్థితి వస్తుంది..! 111 జీవో రద్దుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మరోవైపు, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తన B737-800 విమానాలను జూన్ 4 నుంచి 22వ తేదీ వరకు కోజికోడ్, కన్నూర్ నుంచి నడపనుంది. ఇది కోజికోడ్ నుంచి జెడ్డాకు 44 విమానాలను, కన్నూర్, జెడ్డా మధ్య 13 విమానాలను నడపనున్నట్లు పేర్కొంది. రెండవ దశలో 13 జూలై నుంచి ఆగస్టు 2 మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ యాత్రికులను మదీనా నుంచి కోజికోడ్, కన్నూర్‌లకు తిరిగి తీసుకొస్తుంది.

Royal Enfield EV : బైకులకు రారాజు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ వచ్చేస్తోంది.. గెట్ రెడీ..!

ఈ కార్యకలాపాలపై ఎయిర్ ఇండియా సీఈఓ కాంప్‌బెల్ విల్సన్ మాట్లాడుతూ “పవిత్ర హజ్ యాత్ర కోసం చెన్నై, జైపూర్ నగరాల నుంచి వార్షిక ప్రత్యేక విమానాలను తిరిగి ప్రారంభించడం సంతోషంగా ఉంది. మా ప్రత్యేక విమానాల ద్వారా యాత్రికులకు సేవలందించేందుకు మేము సిద్ధంగా ఉంటాము” అని అన్నారు.