Russia: అమెరికాలోని అల‌స్కా రాష్ట్ర భూభాగం మాది: ర‌ష్యాలో బిల్‌బోర్డుల క‌ల‌కలం

ర‌ష్యాలోని క్రాస్నోయార్స్క్ వ్యాప్తంగా కన‌ప‌డ్డ ఈ రాత‌ల‌కు సంబంధించిన ఫొటోలు ప్ర‌పంచ వ్యాప్తంగా వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం ఉక్రెయిన్-ర‌ష్యా మ‌ధ్య యుద్ధం కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే.

Russia: అమెరికాలోని అల‌స్కా రాష్ట్ర భూభాగం మాది: ర‌ష్యాలో బిల్‌బోర్డుల క‌ల‌కలం

Alaska

Russia: ‘అమెరికాలోని అల‌స్కా రాష్ట్రం మాది’ అంటూ ర‌ష్యాలో బిల్‌బోర్డుల‌పై పేర్కొన్నారు. ర‌ష్యాలోని క్రాస్నోయార్స్క్ వ్యాప్తంగా కన‌ప‌డ్డ ఈ రాత‌ల‌కు సంబంధించిన ఫొటోలు ప్ర‌పంచ వ్యాప్తంగా వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం ఉక్రెయిన్-ర‌ష్యా మ‌ధ్య యుద్ధం కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. ఉక్రెయిన్‌ను త‌మ అధీనంలోకి తెచ్చుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ర‌ష్యా దురాక్ర‌మ‌ణ చేస్తోంది. ఈ స‌మ‌యంలో అల‌స్కా అంశం తెర‌పైకి రావ‌డం గ‌మ‌నార్హం. అలస్కా భూభాగాన్ని రష్యా నుంచి 1867లో అమెరికా కొనుగోలు చేసింది. అనేక‌ పాలక మార్పుల త‌ర్వాత‌ 1959, జనవరి 3న అమెరికా 49వ రాష్ట్రంగా అల‌స్కాను గుర్తించారు.

Presidential election: రేపు ఎన్డీఏ నేత‌ల కీల‌క భేటీ

ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్న ర‌ష్యాపై అమెరికా స‌హా ప‌లు దేశాలు ఆంక్ష‌లు విధిస్తోన్న‌ నేప‌థ్యంలో అల‌స్కా అంశాన్ని ర‌ష్యా ప్ర‌భుత్వం తెర‌పైకి తీసుకొచ్చింది. త‌మ‌పై ప‌శ్చిమ దేశాలు ఆంక్ష‌ల‌ను ఇలాగే ఆంక్ష‌లు కొన‌సాగిస్తే అల‌స్కాను అమెరికా నుంచి తిరిగి స్వాధీనం చేసుకుంటామ‌ని ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ విధేయుడు, ఆ దేశ నేత వ్యాచెస్లావ్ వోలోడిన్ అన్నారు. దీనిపై స్పందించిన అమెరికా అధికారి ఒక‌రు గుడ్ ల‌క్ అంటూ ఎద్దేవా చేశారు. ఈ నేప‌థ్యంలో అల‌స్కా భూభాగం త‌మ‌ది అంటూ ర‌ష్యాలో బిల్‌బోర్డుల‌పై పేర్కొనడం గ‌మ‌నార్హం. ఈ బిల్‌బోర్డులు ఒక్క‌సారిగా క‌న‌ప‌డ‌డంతో క్రాస్నోయార్స్క్ వాసులు సైతం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.