Alien signal Mars to Earth : అంగారకుడి నుంచి భూమికి మొదటి సందేశం .. గ్రహాంతరవాసులు పంపినదేనా అనే అనుమానాలు..!

అంగారక గ్రహంనుంచి భూమికి ఓ సంకేతం వచ్చింది. అది గ్రహాంతరవాసులు పంపించినదేనా? ఈ సంకేతంలో ఏమని ఉంది? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?

Alien signal Mars to Earth : అంగారకుడి నుంచి భూమికి మొదటి సందేశం .. గ్రహాంతరవాసులు పంపినదేనా అనే అనుమానాలు..!

Mars to Earth Alien signal..

Mars to Earth Alien signal : ఏలియన్స్ ఉన్నాయా? అనే ప్రశ్నకు సరైన సమాధానం లభించటంలేదు. నిజంగా గ్రహాంతరవాసులు (Alien) ఉన్నాయా?లేవా? ఉంటే అవి ఎలా ఉంటాయి? అనే ప్రశ్నలకు పూర్తి ఆధారాలు ఎక్కడా లభించలేదు. ఏవో వింత వింత వస్తువులు ఆకాశంలో ఎగరటం..కొన్ని ప్రాంతాల్లో కొన్ని వింత వస్తువులు భూమ్మీద పడ్డాయనే వార్తలు వస్తుంటాయి. అవి ఏలియన్స్ వే అనే అనుమానాలు ఉన్నాయి. కానీ క్లారిటీ లేదు. ఏలియన్స్ నిజంగా ఉండి ఉంటే వాటికి మనిషి ఉనికి తెలియకుండా ఉంటుందా? ఉంటే అవి సంకేతాలు పంపిస్తాయా? అనే ఎన్నె ప్రశ్నలు ఎన్నెన్నో అనుమానాలు. భూమికి ఆవల ఏదో జీవి ఉండే ఉంటుందనే అంచనాలతో శాస్త్రవేత్తలు ఎన్నో విధాలుగా అన్వేషిస్తున్నారు.

ఈక్రమంలో మొట్టమొదటిసారి అంగారక గ్రహం (Mars)నుంచి భూమి(Earth) కి ఓ సంకేతం వచ్చింది. అది ఏలియన్స్ పంపించిందేనా? అని ఖగోళ శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అంగారక గ్రహం నుంచి ఎన్ కోడ్ చేసి వచ్చిన సమాచారాన్ని యూరప్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఎక్సో మార్స్ ట్రేజ్ గ్యాస్ టార్ (ExoMars Trace Gas Orbiter (TGO) భూమికి (Earth) చేరవేసింది. TGO బుధవారం (మే 24,2023)మధ్యాహ్నాం 3.00 గంటలకు అంగారక గ్రహం చుట్టు ఉన్న కక్ష్య నుంచి భూమికి ఒక ఎన్ కోడ్ సందేశాన్ని అందించింది. ఇలా ఇతరగ్రహాల నుంచి ఎన్‌కోడెడ్‌ సమాచారం రావడం ఇదే తొలిసారి. దీంతో శాస్త్రవేత్తలు ఆ దిశగా పరిశోధిస్తున్నారు.

ఈ సువిశాల అంతరిక్షంలో భూమిని పోలిన గ్రహాలు ఉన్నాయి. కానీ వాటిపై జీవజాలం ఉందా? గ్రహాంతరవాసలు (Aliens) ఉన్నారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం చాలా ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తునే ఉన్నారు. కానీ గ్రహాంతరవాసులు ఉన్నారని కచ్చితమైన సమాచారం మాత్రం లభించలేదు ఇంతవరకు.కానీ మనవలెనే ఏదో ఒక గ్రహంపై జీవిస్తున్నారని నమ్మకం అయితే ఉంది. వాటికి మరింత ఊతమిచ్చే ఘటనే భూమికి సమీపంలో ఉన్న అంగారక గ్రహం నుంచి ఎన్‌కోడ్‌ చేసిన ఓ సమాచారాన్ని యూరప్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన ఎక్సోమార్స్‌ ట్రేస్‌ గ్యాస్‌ ఆర్బిటార్‌ (TGO) భూమికి చేరివేసిందనే అభిప్రాయాలు కలుగుతున్నాయి.

అంగారకుడి చుట్టూ తిరుగుతూ అక్కడి పరిస్థితులను నిశితంగా గమనించేందుకు యూరప్‌ స్పేస్‌ ఏజెన్సీ టీజీవోను గతంలో ప్రయోగించింది. ఈ సందేశాన్ని గ్రహాంతర వాసులే పంపించారా? అనే దానిపై స్పష్టత లేదు. అంగారక గ్రహం నుంచి సమాచారాన్ని స్వీకరించిన టీజీవో 16 నిమిషాల్లో ఆ సందేశాన్ని ఎర్త్‌ స్టేషన్‌కు అందించింది. అందులో ఏముందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒక వేళ అది గ్రహాంతర వాసులే పంపిన సమాచారమైతే.. ఈ ఘటన చరిత్రలో నిలిచిపోతుందని కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలోని SETI  (search for extraterrestrial intelligence)‘ఎ సైన్స్‌ ఇన్‌ స్పేస్‌’ ప్రాజెక్టులో భాగమైన మహిళా శాస్త్రవేత్త డానియేలా ది పౌలిస్‌ అన్నారు. ఇది చరిత్రలోనే నిలిచిపోయే ఘటన. గ్రహాంతరవాసుల ఉనికి కోసం ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇతర గ్రహాలపైనున్న జీవరాశుల నుంచి ఓ సందేశం రావడం భవిష్యత్‌ పరిశోధనలకు మరింత ఊతమిస్తుందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలకు ఊతమిస్తోంది అని పేర్కొన్నారు. ఎన్‌కోడ్‌ చేసిన ఆ సందేశంలో ఏముందో తెలుసుకోవడం శాస్త్రవేత్తలకు పెద్ద సవాల్ గా మారింది. ఈ సంకేతాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూడు భారీ టెలిస్కోపులు ఈ ప్రసారాన్ని సంగ్రహించాయి.