మాట నిలబెట్టుకున్నాడు..రూ. 58 వేల కోట్లు దానం

  • Published By: madhu ,Published On : September 17, 2020 / 08:50 AM IST
మాట నిలబెట్టుకున్నాడు..రూ. 58 వేల కోట్లు దానం

ఒకటి కాదు..రెండు కాదు..రూ. 58 వేల కోట్లు దానం చేసి..ఆ వ్యక్తి మాట నిలబెట్టుకున్నాడు. ఎంత సంపాదించినా..అందులో ఆనందం ఉండదని..దానం చేస్తేనే ఎంతో ఆనందంగా ఉంటుందని అంటున్నాడు. అతను ఎవరో కాదు…ఛార్ల్స్‌ ‘చక్‌’ ఫీనీ. విమానాశ్రయాల్లో ఉండే ‘డ్యూటీ ఫ్రీ షాపర్స్‌’ సహవ్యవస్థాపకుడు.



తన స్వచ్చంద సంస్థ అట్లాంటిక్‌ ఫిలాంత్రోపీస్‌’ ద్వారా యావదాస్తిని దానం చేసేస్తానని 2012లో ఫీనీ ప్రకటించాడు. అనుకున్నట్లుగానే..చెప్పిన మాటను నిలుపుకున్నారు. పదవీ విరమణ తర్వాత తన భార్యతో కలిసి జీవించేందుకు కేవలం రూ.14కోట్లనే ఉంచుకున్నాడు. మిగిలిన మొత్తాన్ని వివిధ స్వచ్ఛంద సంస్థలకు దానమిచ్చేశారు.
https://10tv.in/assam-ias-officer-ties-knot-in-simple-ceremony-amid-pandemic-joins-duty-the-day-after/
ప్రస్తుతం ఇతను ఓ మధ్యతరగతి మనిషిలా జీవిస్తున్నాడు. ప్రస్తుతం శాన్‌ఫ్రాన్సిస్కోలో ఒక మామూలు అపార్ట్‌మెంట్‌ లో తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు.  ‘చాలా నేర్చుకున్నా. చాలా సంతోషంగా ఉంది. నేను బతికుండగానే ఈ మంచి పని పూర్తి కావడం నాకు సంతోషంగా అనిపిస్తోందని ఫీనీ వ్యాఖ్యానించారు. ఫోర్బ్స్‌ పత్రికతో మాట్లాడారు.



సంపాదించిన సంపాదనను దానం చేసేందుకు ఫీనీయే స్పూర్తి అని బిల్ గేట్స్, వారెన్ బఫెట్ వ్యాఖ్యానించడం విశేషం. ఆస్తిలో సగం కాదు, యావదాస్తిని దానం చేయాలంటూ తను నాతో పాటు ఎంతోమందిలో స్ఫూర్తిని నింపాడు అని బిల్‌ గేట్స్‌ వెల్లడించారు.