India-China Clash: తవాంగ్‌లో భారత్, చైనా ఘర్షణపై స్పందించిన అమెరికా.. బిడెన్ ఎవరికి మద్దతు ఇచ్చారంటే..

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన విషయం విధితమే. ఈ ఘటనపై అమెరికా స్పందించింది. వైట్ హౌస్ మీడియా సెక్రటరీ కరీన్ జీన్ - పియర్ ఈ విషయంపై మాట్లాడారు.

India-China Clash: తవాంగ్‌లో భారత్, చైనా ఘర్షణపై స్పందించిన అమెరికా.. బిడెన్ ఎవరికి మద్దతు ఇచ్చారంటే..

america president

India-China Clash: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన విషయం విధితమే. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. పార్లమెంటులో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. చైనా యత్నాలు తిప్పికొడతామని అన్నారు. చైనా మాత్రం భారత్ బలగాలే మావైపు చొరబడ్డాయని ఓ ప్రకటన విడుదల చేసింది. ఇరుదేశాల సరిహద్దులో సైనికుల మధ్య నెలకొన్న ఘర్షణ పట్ల అమెరికా స్పందించింది. మంగళవారం విలేకరుల సమావేశంలో వైట్ హౌస్ మీడియా సెక్రటరీ కరీన్ జీన్ – పియర్ ఈ విషయంపై మాట్లాడారు.

India-China Border Clash At LAC : చైనా కవ్వింపులతో ఇండియా అలర్ట్.. నియంత్రణ రేఖ వెంబడి కొత్త డ్రోన్ యూనిట్ల మోహరింపు

తవాంగ్‌లో భారత్, చైనా దేశాల మధ్య జరిగిన ఉద్రిక్త పరిస్థితులను అమెరికా నాశితంగా పరిశీలిస్తోందని కరీన్ జీన్-పీయర్ అన్నారు. వివాదాస్పద సరిహద్దుల గురించి చర్చించడానికి ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక మార్గాలను ఉపయోగించమని ఇరుపక్షాలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఇరువైపుల బలగాలు ఘర్షణ నుంచి త్వరగా వైదొలగినందుకు సంతోషిస్తున్నామని తెలిపారు.

India-China Border Clash At LAC : చైనా దాడిని మోడీ ఎప్ప‌టికీ అంగీక‌రించ‌రు..అరుణాచ‌ల్ ఘటనపై కూడా ఓ కొత్త కథ చెబుతారు : MP అస‌దుద్దీన్ ఓవైసీ

డిసెంబర్ 9న అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ లో శుక్రవారం భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఇరువర్గాల సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. భారత్ భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించిన చైనా బలగాలకు భారత్ బలగాలు ధీటుగా బదులిచ్చాయి. ఈ ఘర్షణలో గాయపడిన చైనా సైనికుల సంఖ్య భారత్ సైనికుల సంఖ్య కంటే ఎక్కువని తెలుస్తుంది. భారత్ సైనికుల్లో ఆరుగురికి మినహా ఎవరికి పెద్దగా గాయాలు కాలేదు. వీరికి చికిత్స అందిస్తున్నారు.