Indian Man: మాజీ ప్రియురాలికి కాబోయే భర్త ఇంటి ముందు ప్రియుడి హల్‌చల్.. ఇంటి ముందు నిప్పు పెట్టినందుకు జైలు శిక్ష

మాజీ ప్రియురాలికి పెళ్లి జరుగుతుండటం చూసి ఒక వ్యక్తి తట్టుకోలేకపోయాడు. ఆమెను చేసుకోబోతున్న వ్యక్తిని ఎలాగైనా ఇబ్బందిపెట్టాలనుకున్నాడు. ఆమెకు కాబోయే భర్త ఇంటికి వెళ్లి వీరంగం సృష్టించాడు.

Indian Man: మాజీ ప్రియురాలికి కాబోయే భర్త ఇంటి ముందు ప్రియుడి హల్‌చల్.. ఇంటి ముందు నిప్పు పెట్టినందుకు జైలు శిక్ష

Indian Man: తన మాజీ ప్రియురాలికి పెళ్లి కాబోతుండటం తట్టుకోలేకపోయాడు ఒక వ్యక్తి. ఆమెకు కాబోయే భర్త ఇంటి ముందు వీరంగం సృష్టించాడు. అతడి అపార్టుమెంట్ ముందు నిప్పు పెట్టి హల్‌చల్ చేశాడు. అతడ్ని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.

Twitter: 150 కోట్ల అకౌంట్లు బ్యాన్ చేయనున్న ట్విట్టర్.. కారణమిదే!

ఈ ఘటన జరిగింది ఇండియాలో కాదు. సింగపూర్‌లో. కాకపోతే నిందితుడు భారత సంతతి వ్యక్తి. ఈ ఘటన గత మార్చిలో జరిగింది. భారత సంతతికి చెందిన సుకుమారన్ సింగపూర్‌లో ఉంటున్నాడు. అతడికి ఒక యువతితో బ్రేకప్ అయింది. కొంతకాలం తర్వాత ఆమెకు మొహమ్మద్ అజ్లి మొహమ్మద్ సల్లేహ్ అనే వ్యక్తితో పెళ్లి కుదిరింది. ఈ పెళ్లి గురించిన సమాచారాన్ని సుకుమారన్ సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాడు. తన మాజీ ప్రేయసి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని సుకుమారన్, ఆమెకు కాబోయే భర్త ఇంటికి వెళ్లి వీరంగం సృష్టించాడు. మొహమ్మద్ అజ్లి ఉంటున్న అపార్ట్‌మెంట్ ఫ్లాట్ ముందు నిప్పు పెట్టాడు. అతడి ఇల్లు, ఆస్తికి నష్టం కలిగించాలనుకున్నాడు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా హుడీ ధరించి, ముఖాన్ని కవర్ చేసుకున్నాడు.

Viral Video: వీడెవడండీ బాబు… మొసలిలాగా డ్రెస్ వేసుకుని, మొసలితోనే ఆటలు.. షాకింగ్ వీడియో

సీసీ కెమెరాలకు కూడా చిక్కకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే, తన ఇంటి ముందు అర్ధరాత్రి మంటలు అంటుకోవడంతో మొహమ్మద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసుపై పూర్తిస్థాయి విచారణ జరిపిన పోలీసులు నిందితుడు తప్పు చేసినట్లు కోర్టులో రుజువు చేశారు. విచారణ జరిపిన సింగపూర్ కోర్ట్ అతడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది.