UK Army: బ్రిటన్ ఆర్మీపై జంతు హక్కుల రక్షణ సంస్థ ‘పెటా’ కేసు.. తమ టోపీలు వాడేలా చూడాలని పిటిషన్

బ్రిటన్ ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేసేందుకు జంతు హక్కుల పరిరక్షణ సంస్థ ‘పెటా’ సిద్ధమవుతోంది. బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖను ప్రతివాదిగా చేర్చనుంది.

UK Army: బ్రిటన్ ఆర్మీపై జంతు హక్కుల రక్షణ సంస్థ ‘పెటా’ కేసు.. తమ టోపీలు వాడేలా చూడాలని పిటిషన్

UK Army: బ్రిటన్ ఆర్మీపై జంతు హక్కుల పరిరక్షణ సంస్థ ‘పెటా’ కేసు దాఖలు చేయనుంది. ఎలుగుబంటి బొచ్చుతో తయారైన టోపీల్ని సైన్యం వాడుతుండటమే ఇందుకు కారణం. పెటా సంస్థ అంతర్జాతీయంగా జంతు హక్కులపై పోరాడుతుందనే సంగతి తెలిసిందే. జంతువులపై హింస, జంతు ఉత్పత్తుల వాడకం వంటి వాటికి వ్యతిరేకంగా ఉద్యమిస్తుంటుంది.

Viral Video: వీడెవడండీ బాబు… మొసలిలాగా డ్రెస్ వేసుకుని, మొసలితోనే ఆటలు.. షాకింగ్ వీడియో

ఈ నేపథ్యంలో బ్రిటన్ రక్షణ శాఖ అనుసరిస్తున్న వైఖరిని తప్పుబడుతోంది. బ్రిటన్ సైన్యంలోని ఒక విభాగానికి చెందిన సైనికులు కెనడియన్ ఎలుగుబంటికి చెందిన బొచ్చుతో తయారైన టోపీని వాడుతారు. బకింగ్ హామ్ ప్యాలెస్ దగ్గర విధులు నిర్వర్తించే సైనికులు ఈ టోపీల్ని ధరిస్తారు. అయితే, ఇలా ఎలుగుబంటి బొచ్చుతో తయారైన ఈ టోపీల వాడకాన్ని పెటా చాలా కాలంగా వ్యతిరేకిస్తోంది. దీన్ని అడ్డుకునేందుకు అలాంటి టోపీల్ని పోలిన కృత్రిమ టోపీల్ని పెటా రూపొందించింది. వీటిని పరిశీలించాలని బ్రిటన్ రక్షణ శాఖను కోరింది. అయితే, బ్రిటన్ వాటిని పరిశీలించేందుకు నిరాకరించింది. పెటా రూపొందించిన టోపీలు తమ ప్రమాణాలకు అనుగుణంగా లేవని, అందువల్ల వాటిని పరిశీలించలేమని ప్రభుత్వం చెప్పింది.

వాటిని సైన్యంలో వాడే ఉద్దేశం లేదని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. గతంలో బ్రిటన్ పార్లమెంటులో కూడా ఈ అంశంపై చర్చ జరిగింది. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెటా కోర్టును ఆశ్రయించనుంది. తాము రూపొందించిన టోపీలు వాడేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పెటా పిటిషన్ దాఖలు చేయనుంది.