California Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. తొమ్మిది మంది మృతి..

దక్షిణ కాలిఫోర్నియాలో శనివారం అర్థరాత్రి జరిగిన కాల్పుల్లో 11 మంది మరణించిన విషయం విధితమే. ఈ ఘటన మరవక ముందే సోమవారం మూడు చోట్ల కాల్పుల ఘటన చోటుచేసుకోవటం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. మూడు చోట్ల కాల్పుల ఘటనల్లో తొమ్మిది మంది మరణించగా, ముగ్గురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

California Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. తొమ్మిది మంది మృతి..

southern california

California Shooting: దక్షిణ కాలిఫోర్నియాలో శనివారం అర్థరాత్రి జరిగిన కాల్పుల ఘటనలో 11 మంది మరణించిన విషయం విధితమే. ఈ ఘటన మరవకముందే మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం సమయంలో శాన్‌ఫ్రాన్సిస్కోకు దక్షిణ ప్రాంతంలో ఓ పుట్ట గొడుగుల పెంపకం వద్ద, ట్రక్కింగ్ సంస్థ వద్ద కాల్పులు జరిగారు. రెండు చోట్ల జరిగిన కాల్పుల్లో ఏడుగురు చనిపోయినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో కొంతమందికి గాయాలుసైతం అయ్యాయి. అయితే, కాల్పుల ఘటనకు కారణమైన ఒక అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.  అదేవిధంగా అమెరికాలోని అయోవాలోని డెస్ మోయిన్స్ నగరంలో ఓ పాఠశాలలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మరణించారు. ఓ ఉపాధ్యాయుడు గాయపడగా.. అతన్ని చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

California Shooting: క్యాలిఫోర్నియా కాల్పుల నిందితుడు ఆత్మహత్య.. పోలీసులు చుట్టుముట్టడంతో గన్‌తో కాల్చుకుని మృతి

రెండు చోట్ల జరిగిన కాల్పుల ఘటనలపై కాలిఫోర్నియా రాష్ట్ర సెనెటర్ జోష్ బెకర్ మాట్లాడుతూ.. శాన్‌ఫ్రాన్సిస్కోకు దక్షిణంగా 48 కిలో మీటర్ల దూరంలో ఉన్న హాఫ్‌మూన్ బే శివార్లలో వ్యవసాయ క్షేత్రంలో నలుగురు, ట్రక్కింగ్ వ్యాపారంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. కాల్పులకు కారణమైన వారిలో ఒక అనుమానిత వ్యక్తిని సోమవారం సాయంత్రం 5గంటల సమయంలో శాన్ మాటియో కౌంటీషెరీఫ్ కార్యాలయంలో అదుపులోకి తీసుకోవటం జరిగిందని ఆయన ట్వీట్ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారు ఎవరై ఉంటారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. స్థానికంగా‌ఉన్న సీసీ పుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.

California Shooting: క్యాలిఫోర్నియాలో దుండగుడి కాల్పులు.. పది మంది మృతి?

దక్షిణ కాలిఫోర్నియాలో శనివారం అర్థరాత్రి జరిగిన కాల్పుల్లో 11 మంది మరణించిన ఘటన మరవక ముందే మరోసారి మూడు చోట్ల కాల్పులు చోటు చేసుకోవటం స్థానికులను ఆందోళన కలిగిస్తోంది. శాన్ మాటియో కౌంటి బోర్డ్ ఆఫ్ సూపర్ వైజర్స్ ప్రెసిడెంట్ డేన్ పైన్ మాట్లాడుతూ.. శనివారం ఘటన నుంచి మేము ఇంకా తేరుకోలేదని, వెంటనే మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకోవటం తమను తీవ్ర బాధకు గురిచేసిందని అన్నారు. తుపాకీ హింస ఆగాలని ఆయన అన్నారు.