Art On Frozen Lake : గడ్డకట్టిన సరస్సుపై 90 మీటర్ల భారీ చిత్రం..

గడ్డకట్టిన సరస్సుపై ఓ శిల్పి 90 మీటర్ల భారీ చిత్రాన్నిచెక్కారు. ధవళవర్ణంలో మెరిసిపోయే సరస్సుపై నక్క చిత్రం పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది.

Art On Frozen Lake : గడ్డకట్టిన సరస్సుపై 90 మీటర్ల భారీ చిత్రం..

90 Meters Fox Art On Frozen Lake

90 Meters Fox Art on Frozen Lake : చలికాలం వచ్చిదంటే చాలు మంచుసైతం గడ్డకట్టుకుపోయే ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. సరస్సులు కూడా ఐసులాగా గడ్డకట్టుకుపోతాయి. అలా శీతాకాలం వచ్చిదంటే చాల ఫిన్​లాండ్​ అంతా శ్వేతవర్ణంలోకి మారిపోతుంది. ఇంటిలో నీరు కూడా గడ్డకట్టుకుపోయేంత చల్లగా ఉంటుందక్కడ. ఇక బయటకు రావాలంటే ఒంటిపై ఇంచు బయటకు కనిపించినా రక్తం గడ్డకట్టుకుపోయేంత చలి కొరికేస్తుంది.

Read more : Albrecht Dürer Art : 500 ఏళ్ల నాటి అద్భుత కళాఖండం..రూ. 374 కోట్లు..!!

అలా శీతాకాలంలో చలికి సరస్సులు గడ్డకట్టుకుపోతాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో పర్యాటకులు ఈ శ్వేతవర్ణ అందాల్ని చూడటానికి చలిని కూడా లెక్క చేయకుండా వస్తుంటారు. అలా పర్యాటకుల్ని ప్రోత్సహించేందుకు ఓ వినూత్న ప్రయత్నం చేస్తున్నారు ఫిన్లాండ్ కు చెందిన శిల్పి, డిజైనర్ అయిన పాసి విడ్​గ్రెన్.

మంచుకు గడ్డకట్టుకుపోయిన దక్షిణ ఫిన్లాండ్ లోని పిట్కాజార్వీ సరస్సుపై డిసెంబర్ 4,2021 ఓ భారీ చిత్రాన్ని తీర్చి దిద్దారు. అది ఓ నక్క బొమ్మ. ఆ నక్క బొమ్మ 90 మీటర్ల విస్తీర్ణంలో గీశారు. కేవలం నాలుగు గంటలలోనే ఈ నక్క బొమ్మను తీర్చిదిద్దడం విశేషం. జార్వీ ఇలా ఏటా మంచుపై వివిధ చిత్రాలను గీస్తుంటారు. అలా ఈ సంవత్సరం ఓ నక్క కూర్చున్నట్లుగా ఉన్న బొమ్మను చెక్కారు.

Read more : ప్రపంచంలోనే అతిపెద్ద పెయింటింగ్ ధర RS. 450 కోట్లు..!!