Afghanistan : ఆసుపత్రిలో బాంబుదాడి.. 19 మంది మృతి

అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్‌లో బాంబుల మోత మోగింది. మిలటరీ ఆసుపత్రికి లక్ష్యంగా చేసుకొని రెండు బాంబులు పేల్చారు.. అనంతరం ఫైరింగ్ చేశారు.

Afghanistan : ఆసుపత్రిలో బాంబుదాడి.. 19 మంది మృతి

Afghanistan

Afghanistan : అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్‌ బాంబుల మోతతో దద్ధరిల్లింది. మిలటరీ ఆసుపత్రికి లక్ష్యంగా చేసుకొని రెండు బాంబులు పేల్చారు.. అనంతరం ఫైరింగ్ చేశారు. ఈ ఘటనలో మొత్తం 19 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది.. ఇక కాల్పుల్లో సుమారు 50 మంది గాయపడినట్లు అఫ్గాన్ మీడియా ప్రకటించింది. గాయపడిన వారిని నగరంలోని మరో ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఇక ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు.

చదవండి : Afghan : మా పాలన గుర్తించండి…తాలిబన్ల విజ్ఞప్తి

అఫ్ఘాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన నాటి నుంచి బాంబుదాడులు అధికంగా జరుగుతున్నాయి.. ఆగస్టు నెలలో ప్రజాప్రభుత్వాన్ని పడగొట్టి అధికారం చేతులోకి తీసుకుంది తాలిబన్ సంస్థ. అఫ్ఘాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిన కొద్దీ రోజుల్లోనే కాబుల్ విమానాశ్రయంలో బాంబుదాడి జరిగింది. ఈ దాడిలో 13 మంది అమెరికా సైనికులతో సహా 169మంది అఫ్ఘాన్ పౌరులు మృతి చెందారు.

చదవండి : Afghan Crisis : పిల్లల ఆకలి తీర్చడానికి పసిగుడ్డు అమ్మకం..

ఆ తర్వాత దేశ వ్యాప్తంగా అనేక పేళ్ళుల్లు జరిగాయి.. గతనెలలో కుందుజ్ సిటీలో ప్రార్ధన స్థలాన్ని టార్గెట్ గా చేసుకొని ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు ఉగ్రవాదులు.. ఈ దాడిలో 55 మంది అఫ్ఘాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.