సముద్రంలోకి వెళ్లి ‘టైటానిక్’ చూడొచ్చు.. ఖర్చు రూ .93 లక్షలు.. చరిత్రలో నిలిచే అవకాశం!

  • Published By: vamsi ,Published On : November 16, 2020 / 03:11 PM IST
సముద్రంలోకి వెళ్లి ‘టైటానిక్’ చూడొచ్చు.. ఖర్చు రూ .93 లక్షలు.. చరిత్రలో నిలిచే అవకాశం!

1912వ సంవత్సరంలో ఉత్తర అట్లాంటిక్‌లోని మంచుకొండను ఢీకొట్టి, సముద్రంలో మునిగిపోయింది టైటానిక్ షిప్. తర్వాత 1985లో ఆ షిప్‌కి సంబంధించిన అవశేషాలు అట్లాంటిక్ సముద్రంలో కనుగొనబడ్డాయి. ప్రమాదంలో 1500 మంది మరణించారు. ఈ సంఘటన ఆధారంగా సినిమా కూడా వచ్చిన సంగతి తెలిసిందే. 1997లో ప్రఖ్యాత హాలీవుడ్ దర్శక నిర్మాత జేమ్స్ కామెరాన్ రూపొందించిన హాలీవుడ్ సినిమా టైటానిక్. ఈ సంఘటన నేపథ్యంలోనే చిత్రీకరించారు.



https://10tv.in/jr-ntr-phone-to-his-fan/
ఈ కథలో నాయకా నాయికలైన లియోనార్డో డికాప్రియో, కేట్ విన్‌స్లెట్ వేర్వేరు సామాజిక వర్గానికి చెందిన వారు. టైటానిక్ ప్రయాణంలో వీరిద్దరూ ప్రేమలో పడి చివరికి ప్రమాదం ద్వారా విడిపోతారు. ఇదే కథాంశం కాగా.. ఈ సినిమా తర్వాత టైటానిక్ చూడాలని అనుకునేవారి కోరిక బాగా పెరిగింది. ఈ షిప్ బ్రిటన్‌లోని సౌతాంప్టన్ నౌకాశ్రయం నుండి న్యూయార్క్ వెళ్తోంది. మంచుకొండను కొట్టిన తరువాత టైటానిక్ రెండు ముక్కలుగా విరిగింది. దీని శిధిలాలు 3.8 కిలోమీటర్ల లోతులో ఉన్నాయి.

Titanic (1997)
Directed by James Cameron
Shown from left: Leonardo DiCaprio, Kate Winslet


అయితే ఇప్పుడు అసలు టైటానిక్‌ని చూడడానికి సొంత కళ్ళతో మిగిలిపోయిన శిధిలాలను సందర్శించడానికి నీటి అడుగున ప్రపంచం అన్వేషణకు అంకితమైన ఒక సంస్థ అవకాశం కల్పిస్తుంది. అయితే అందుకోసం ఒక్కరికి 1.25లక్షల డాలర్లు (రూ. 93లక్షల 15వేలు) ఖర్చు అవుతుంది. సముద్రం ఉపరితలం నుండి సుమారు 12,467 అడుగుల ప్రయాణం ప్రయాణించి యాత్ర బృందం ఓషన్ గేట్ సబ్ ఉపయోగించి లోపలికి తీసుకుని వెళ్తుంది. THE TITANIC SURVEY EXPEDITION 2021 project పేరుతో తీస్తున్న డాక్యుమెంటరీలో భాగంగా టీమ్‌తో వెళ్లవచ్చు. వాస్తవానికి దీనికి సంబంధించిన ఖర్చు చాలా ఎక్కువే అనిపిస్తుంది. కానీ, ఇందులో వచ్చే ఎక్స్‌పీరియన్స్ Never Befor Ever After అని అంటున్నారు.



టైటానిక్ సర్వే యాత్రలో భాగంగా.. ఎక్కువ మందికి లోతైన మహాసముద్రాలలోకి ప్రవేశించడానికి మరియు మునిగిపోయిన షిప్‌లకు సంబంధించి పరిశోధనలు చేసేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే.. సముద్రయాన శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు మరియు టైటానిక్ సముద్ర శాస్త్రవేత్తలతో యాత్రలో చురుకైన యాత్ర పాత్ర పోషించేలా వీలు కల్పిస్తుంది. బృందం దీనిని రాబోయే తరాల కోసం డాక్యుమెంట్ చేస్తుంది.



ప్రమాదం జరిగిన ప్రదేశం కెనడాలోని న్యూఫౌండ్లాండ్ తీరానికి 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ భయంకరమైన శీతాకాలపు సముద్రంలో చీకటితో చుట్టుముట్టబడిన టైటానిక్ శిధిలాలు దాదాపు 70 సంవత్సరాలుగా ఎవరూ తాకలేదు. ఈ సమయంలో బ్యాక్టీరియా దాని లోహ నిర్మాణంపై మంచు కారణంగా చిన్న మృదువైన చుక్కలు దాని శిధిలాలపై ఏర్పడ్డాయి.

రాబోయే 20 నుంచి 50 సంవత్సరాలలో బ్యాక్టీరియా టైటానిక్ షిప్‌ శిధిలాలను పూర్తిగా తినేస్తుంది. అందువల్ల ఇప్పుడు తీసే డాక్యుమెంటరీకి ప్రత్యేక స్థానం ఉండబోతుంది. చరిత్రలో నిలిచే అవకాశం లభిస్తుంది అని అంటున్నారు.