Australia Borders: అంతర్జాతీయ పర్యాటకులను అనుమతించనున్న ఆస్ట్రేలియా

దాదాపు 23 నెలల పాటు పర్యాటకులను దేశంలోకి అనుమతించకపోవడంతో.. దేశంలో పర్యాటకం కుంటుపడింది. ఈ వారంలో పార్లమెంటులో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రధాని ప్రకటించారు.

Australia Borders: అంతర్జాతీయ పర్యాటకులను అనుమతించనున్న ఆస్ట్రేలియా

Australia

Australia Borders: అంతర్జాతీయ పర్యాటకులను అతిత్వరలోనే దేశంలోకి అనుమతించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మొరిసన్ ఆదివారం ప్రకటించారు. పర్యాటకులను అనుమతించే విషయంపై ఈ వారంలో పార్లమెంటులో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రధాని ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 2020లో ఆస్ట్రేలియా తమ సరిహద్దులను మూసివేసింది. దేశంలో కఠిన లాక్ డౌన్ విధించడంతో పాటు.. విదేశాల్లో ఉన్న తమ పౌరులను సైతం దేశంలోకి అనుమతించబోమంటూ స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో.. దశల వారీగా సరిహద్దులు తెరిచింది. ఆస్ట్రేలియా పౌరులు, సిటిజన్లు, స్కిల్ల్డ్ ఇమ్మిగ్రెంట్స్, అంతర్జాతీయ విద్యార్థులు మరియు ఇతర కార్మికులను మాత్రమే అనుమతించిన ఆస్ట్రేలియా.. అంతర్జాతీయ పర్యాటకులను మాత్రం అనుమతించలేదు.

Also read: Chandrababu: కొత్త జిల్లాలకు అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టలేదు?: చంద్రబాబు

అయితే దాదాపు 23 నెలల పాటు పర్యాటకులను దేశంలోకి అనుమతించకపోవడంతో.. దేశంలో పర్యాటకం కుంటుపడింది. ఇలానే కొనసాగితే పరిస్థితి చేయిదాటి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందన్న విశ్లేషకుల అభిప్రాయం మేరకు ప్రభుత్వం స్పందించింది. పర్యట రంగానికి ఊతమిచ్చేలా త్వరితగతిన అంతర్జాతీయ పర్యాటకులకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు 2022లో సోమవారం నాడు మొదటిసారి జరుగనున్న సమావేశాల్లో.. ఈ అంశాన్ని ప్రాధాన్యతగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ఆ దేశ హోంశాఖామంత్రి కారెన్ ఆండ్రూస్ తెలిపారు.

Also read:PM Narendra Modi: కొందరికి కలలో కృష్ణుడు కనిపిస్తున్నాడు: అఖిలేష్ యాదవ్ పై మోదీ సెటైర్ 

కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలో దేశంలో కఠిన ఆంక్షలు విధించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం..ఇటీవల కాలంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. ఎంత కట్టడి చేసినా, ఎన్ని ఆంక్షలు విదించినా.. ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని అడ్డుకోలేకపోయింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. అయితే మూడో దశలో ఓమిక్రాన్ తీవ్ర ప్రభావం చూపినప్పటికీ.. ఆసుపత్రి పాలైన ఘటనలు, మరణాల రేటు మాత్రం తగ్గింది. దేశ జనాభాలో 16 ఏళ్లు నిండిన 95 శాతం మందికి మొదటి డోసు వాక్సిన్ పూర్తి అయింది. వారిలో 90 లక్షల మంది రెండు డోసులు కూడా తీసుకున్నారు. ఈక్రమంలో రెండు డోసుల కరోనా వాక్సిన్ వేయించుకున్న వారినే దేశంలోకి అనుమతించనున్నట్లు ప్రధాని స్కాట్ మోరీసన్ వివరించారు.

Also read: PM Modi : తెలుగు సినిమాని పొగడ్తలతో ముంచేసిన పీఎం నరేంద్రమోదీ