Chandrababu: కొత్త జిల్లాలకు అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టలేదు?: చంద్రబాబు

అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తే... దానికి దళిత తేజం బాలయోగి పేరు తొలగించాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నారు.

Chandrababu: కొత్త జిల్లాలకు అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టలేదు?: చంద్రబాబు

Tdp

Chandrababu:  ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలకు అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టలేదని మాజీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. వైసీపీ సర్కారు తీరుపై మండిపడ్డారు. ఏపీలో జిల్లాల విభజన పై చంద్రబాబు స్పందిస్తూ..అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తే… దానికి దళిత తేజం బాలయోగి పేరు తొలగించాల్సిన అవసరం లేదని అన్నారు. రాష్ట్రంలో గురుకుల విద్యా సంస్థలకు ఉన్న దివంగ‌త లోక్ స‌భ స్పీక‌ర్ బాల‌యోగి పేరును తొలగించడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. దళితుల సంక్షేమానికి జాతీయ స్థాయిలో ఎనలేని కృషి చేసిన బాల‌యోగి పేరును తొల‌గించ‌డం అవమానకరమని చంద్రబాబు అన్నారు.

Also read: PM Narendra Modi: కొందరికి కలలో కృష్ణుడు కనిపిస్తున్నాడు: అఖిలేష్ యాదవ్ పై మోదీ సెటైర్

అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తే… దానికి దళిత తేజం బాలయోగి పేరు తొలగించాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నారు. జగన్ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే.. వైఎస్ పేరుతో ఉన్న కార్యక్రమాల‌కు ఆ పేరు తొల‌గించి అంబేద్కర్ పేరు పెట్టొచ్చని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీలో కొత్త జిల్లాలకూ అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంతోనే తెలుగు జాతి గ‌ర్వప‌డే ద‌ళిత బిడ్డ బాల‌యోగి పేరును జగన్ తొల‌గించారని చంద్రబాబు అన్నారు.

Also read: AP PRC ISSUE: చర్చల్లో ఒకే అని ఇపుడు ఇలా అంటారేంటి: సూర్యనారాయణ