PM Narendra Modi: కొందరికి కలలో కృష్ణుడు కనిపిస్తున్నాడు: అఖిలేష్ యాదవ్ పై మోదీ సెటైర్

బీజేపీ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి కొందరికి రాత్రిళ్ళు నిద్రలో శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ నుద్దేశించి ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు

PM Narendra Modi: కొందరికి కలలో కృష్ణుడు కనిపిస్తున్నాడు: అఖిలేష్ యాదవ్ పై మోదీ సెటైర్

Bjp

PM Narendra Modi: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారాలల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష ఎస్పీ మధ్య మాటల తూటాలు తారాస్థాయికి చేరాయి. అభివృద్ధి నినాదమే ప్రచార అస్త్రంగా బీజేపీ ముందుకు వెళ్తుంటే.. అధికారమే లక్ష్యంగా ఎస్పీ నేతలు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి.. కొందరికి రాత్రిళ్ళు నిద్రలో శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడని..ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ను ఉద్దేశించి.. ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆదివారం వర్చువల్ విధానంలో జరిగిన సమావేశంలో ఉత్తరప్రదేశ్ లోని మధుర, ఆగ్రా, బులంద్‌షహర్ నియోజకవర్గాల ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.

Also read: AP PRC ISSUE: చర్చల్లో ఒకే అని ఇపుడు ఇలా అంటారేంటి: సూర్యనారాయణ

“ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చి రామరాజ్య పాలన చేస్తున్నట్టు శ్రీకృష్ణుడు తన కలలోకి వచ్చి చెబుతన్నాడని” ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ గతంలో చేసిన వ్యాఖ్యలపై మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. యూపీలో బీజేపీ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు తమ ప్రభుత్వానికే మొగ్గు చూపుతున్నారని.. ప్రజల్లో బీజేపీపై ఉన్న ఆదరణ చూసి కొందరికి నిద్రలో శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

Also read: AP PRC Issue: పీఆర్సీ స్టీరింగ్ కమిటీతో ఏకీభవించని ఉపాధ్యాయ సంఘాలు, రంగంలోకి పోలీసులు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాలు.. ప్రజలను దోచుకు తిన్నాయని.. ప్రజల నమ్మకాలను, అవసరాలను పట్టించుకున్న పాపాన పోలేదంటూ ప్రధాని మోదీ ఎస్పీ, బీఎస్పీ పార్టీలపై ధ్వజమెత్తారు. ఆర్ధిక బలం, కండ బలం, కులమతాల ఆధారంగా గతంలో వారు చేసిన పాలనను ప్రజలు తిరస్కరించారన్న ప్రధాని మోదీ..ఇప్పుడు ప్రజలు అభివృద్ధినే కోరుకుంటున్నారని అన్నారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా.. ప్రజల ఆదరాభిమానాలు బీజేపీకే ఉన్నాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

Also read: Red Sanders: చంద్రగిరి పరిధిలో అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం పట్టివేత