PM Apologies : దేశ ప్రజలకు క్షమాపణ చెప్పిన ఆస్ట్రేలియా ప్రధాని

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ ప్రజలకు క్షమాపణ చెప్పారు. కరోనా నియంత్రణ కోసం వ్యాక్సినేషన్ టార్గెట్ ను చేరుకోలేకపోయానని దానికి పూర్తి బాధ్యత తనదేనని అందుకే దేశ ప్రజల్ని క్షమించమని కోరుతున్నానని తెలిపారు.

PM Apologies : దేశ ప్రజలకు క్షమాపణ చెప్పిన ఆస్ట్రేలియా ప్రధాని

Australia Pm Apologies

Australia PM Apologies : ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ ప్రజలకు క్షమాపణ చెప్పారు. కరోనా నియంత్రణ కోసం వ్యాక్సినేషన్ టార్గెట్ ను చేరుకోలేకపోయానని దానికి పూర్తి బాధ్యత తనదేనని అందుకే దేశ ప్రజల్ని క్షమించమని కోరుతున్నానని తెలిపారు. సంవత్సర ప్రారంభంలో పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయామని..దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోందని.. ఇందుకు పూర్తి బాధ్యత తనదేనని.. అందుకు క్షమాపణలు చెబుతున్నానని ఆస్ట్రేలియా ప్రధాని ఆ దేశ ప్రజలను క్షమాపణ కోరారు.

ఆస్ట్రేలియాలో వ్యాక్సినేషన్ చాలా చాలా మందకొడిగా సాగుతోంది. ఎంతగానంటే..దేశం మొత్తం మీద రోజుకు లక్షా 50 వేల డోసుల కంటే తక్కువే ఇస్తున్న పరిస్థితి. దీని ఫలితంగా దేశంలోనే రెండు పెద్ద రాష్ట్రాలైన న్యూ సౌత్ వేల్స్, విక్టోరియాలో కరోనా కేసులు కొత్తవి పుట్టుకొస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

అలాగే ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరమైన సిడ్నీలో 110 కరోనా కేసులు కొత్త కేసులు నమోదయ్యాయి. సిడ్నీలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా జూన్ 26 నుంచి లాక్‌డౌన్ అమలులో ఉన్నా కేసులు పెరుగుతున్నాయి. ఈ లాక్ డౌన్ జులై 30 వరకూ కొనసాగనుంది. న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ గ్లాడిస్ బెరెజిక్లియన్ న్యూస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. న్యూ సౌత్ వేల్స్‌ ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు. జులై 30 వరకూ రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతుందని.. ఇదే విధంగా కేసులు పెరిగితే లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు.

కాగా..2021 పూర్తి లోపు వ్యాక్సిన్ లక్ష్యాలను చేరుకుంటామని.. కొద్ది వారాల్లో మొడెర్నా, ఫైజర్ వ్యాక్సిన్‌లు దేశానికి చేరుకోబోతున్నాయని ఆస్ట్రేలియా ప్రభుత్వం వెల్లడించింది. కొత్తకేసులు పెరగకుండే ఉండేందుకు ఆస్ట్రేలియాలోని పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఇప్పటికీ కొనసాగుతోంది.