Pak first woman SC judge : పాకిస్తాన్‌ చరిత్రలో సంచలనం..సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్‌ అయేషా మాలిక్‌..

పాకిస్తాన్‌ చరిత్రలో సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్‌ అయేషా మాలిక్‌ నియమితులై సంచలనం సృష్టించారు.

Pak first woman SC judge : పాకిస్తాన్‌ చరిత్రలో సంచలనం..సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్‌ అయేషా మాలిక్‌..

Pak First Woman Sc Judge (1)

Pakistan first woman SC judge : పాకిస్తాన్ చరిత్రలో సంచలనం కలిగే ఓ అద్భుత ఘటన జరిగింది. అదే ఓ మహిళ తొలిసారిగా సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు తొలి మహిళ న్యాయమూర్తిగా జస్టిస్ అయేషా మాలిక్‌ నియమితులై చరిత్ర సృష్టించారు. లాహోర్ హైకోర్టుకు చెందిన జస్టిస్ అయేషా మాలిక్ – పాకిస్తాన్ తన మొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితురాలై ఓ సువర్ణ అధ్యాయానికి నాంది పలికారు.

ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ నేతృత్వంలోని పాకిస్తాన్ జ్యుడీషియల్ కమిషన్ (JCP) గురువారం (జనవరి 6,2022)ఐదు ఓట్ల మెజారిటీతో జస్టిస్ అయేషా మాలిక్‌ను ఆమోదించింది. లాహోర్ హైకోర్టుకు చెందిన జస్టిస్ అయేషా మాలిక్ పాకిస్తాన్ సుప్రీంకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తిగా ఎంపిక కావడం అత్యంతగా చెప్పుకోదగిన విశేషం. జస్టిస్‌ అయేషా మాలిక్‌ పదవిపై నిర్ణయం తీసుకునేందుకు జేసీపీ సమావేశం నిర్వహించడం ఇది రెండోసారి కావడం గమనించాల్సిన విషయం. అయేషా పేరు మొదటిసారి 2021 సెప్టెంబర్ 9న చర్చ జరిగింది. ఆ సమయంలో ఆమెకు వ్యతిరేకంగా నాలుగు ఓట్లు రావటంతో ఆమె తిరస్కరించబడింది.

కన్యత్వ పరీక్షను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న థీర  అయేషా మాలిక్..
అయేషా లాహోర్‌లోని పాకిస్థాన్ కాలేజ్ ఆఫ్ లా‌(PCL)లో ఆమె లా చదివారు. తరువాత ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లారు.లండన్‌లోని హార్వర్డ్ లా స్కూల్‌లో లా‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. కరాచీలో 1997 నుంచి 2001 వరకు న్యాయవాదిగా పనిచేశారు. 2012లో లాహోర్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. పాకిస్థాన్‌లోని పలు హైకోర్టులు, జిల్లా కోర్టులు, బ్యాంకింగ్ కోర్టులు, స్పెషల్ ట్రైబ్యునల్స్, ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్స్‌లలో అయేషా సేవలందించారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ఉమెన్ జడ్జెస్(IAWJ) లోనూ సభ్యురాలిగా పనిచేశారు అయేషా.

చీఫ్ జస్టిస్ ఆఫ్ పాకిస్థాన్‌గా ఓ మహిళ నియామకం శుభపరిణామం : డాన్ పత్రిక 

జస్టిస్ ఆయేషా మాలిక్ లింగ సమానత్వం, మహిళా సాధికారత, మహిళా హక్కులు, మహిళలపై వేధింపులకు సంబంధించిన కేసుల్లో చారిత్రక తీర్పులు ఇచ్చిన చరిత్ర ఆమెది. అంతేకాదు..కన్యత్వ పరీక్షను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుని చరిత్ర సృష్టించారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ పాకిస్థాన్‌గా ఓ మహిళ నియమితులుకానుండటం ఓ మంచి వార్త అంటూ పాక్ ప్రత్రి డాన్ వ్యాఖ్యానించింది.

పాకిస్థాన్‌లో మహిళా హక్కుల ఉల్లంఘనపై నిరంతరం పలు విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. ఇస్లామిక్ దేశం కాబట్టి పాక్ లో అటువంటివి జరుగుతుంటాయి. ఈక్రమంలో తొలిసారిగా ఓ మహిళ పాకిస్థాన్ చీఫ్ జస్టిస్‌గా నియమితులు కావడంతో అంతర్జాతీయ మీడియా వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. అయేషా మాలిక్ పేరు మారుమోగిపోతోంది.