Baba Vanga Prediction 2023: 2023లో సౌర సునామీ, గ్రహాంతర వాసుల దాడితప్పదా? బాబా వాంగ ఏం చెప్పింది? ఆసలు ఆమె ఎవరు?

బాబా వాంగ 1911లో బల్గేరియాలో జన్మించారు. ఆమె అసలు పేరు వాంగేలియా పాండేవా గుష్టేరోవా. చిన్నతనంలోనే (12వ ఏట) ఆమె కంటిచూపు కోల్పోయింది. ఆమెను ‘నోస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్స్’ అని కూడా పిలుస్తారు. ఆమె చిన్నతనంలోనే చూపును కోల్పోయినప్పటికీ.. ఆ తర్వాత దేవుడు తనకు భవిష్యత్తును చూసే అరుదైన బహుమతిని ఇచ్చాడని పేర్కొన్నారు. ఆమె 1996లో మరణించారు.

Baba Vanga Prediction 2023: 2023లో సౌర సునామీ, గ్రహాంతర వాసుల దాడితప్పదా? బాబా వాంగ ఏం చెప్పింది? ఆసలు ఆమె ఎవరు?

Baba Vanga Prediction 2023: బాబా వాంగ.. బల్గేరియన్ అంధ ఆధ్యాత్మికవేత్త. ఆమె భవిష్యత్తును అంచనా వేస్తుంది. ఆమె చెప్పినవి జరుగుతాయని చాలామంది నమ్ముతారు. గతంలో ఆమె చెప్పినట్లుగా పలు సంఘటనలు జరగడమే ఇందుకు కారణం. బాబా వాంగ గతంలో 9/11 ఉగ్రదాడులు, బ్రెగ్జిట్, యువరాణి డయానా మరణం, ఒరాక్ ఒబామా అధ్యక్ష పదవి వంటి అనేక విషయాలను ఆమె తన భవిష్యవాణిలో ముందే చెప్పారట. గత ఏడాది (2022)లో కూడా ఆమె చెప్పిన పలు విషయాలు జరిగాయి. కొన్ని దేశాల్లో వరదలు కారణంగా పరిస్థితి మరింత దిగజారుతుందని బాబా వాంగ అంచనా వేశారు. పోర్చుగల్, ఇటలీలో చాలా ప్రాంతాల్లో కరువును ముందే చెప్పారు. బాబా వాంగ చెప్పిన భవిష్యవాణిలో ఇప్పటి వరకు 85శాతం భూమిమీద సంభవించాయట.

Baba Vanga :‘పుతిన్ ప్రపంచానికి రాజు అవుతాడు..రష్యా ఈ లోకాన్ని శాసించబోతోంది..దీన్నిఎవరూ ఆపలేరు’ : బాబా వంగా జోస్యం

బాబా వాంగ ఎవరు?

Baba Vanga

Baba Vanga

బాబా వాంగ 1911లో బల్గేరియాలో జన్మించారు. ఆమె అసలు పేరు వాంగేలియా పాండేవా గుష్టేరోవా. చిన్నతనంలోనే (12వ ఏట) ఆమె కంటిచూపు కోల్పోయింది. ఆమెను ‘నోస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్స్’ అని కూడా పిలుస్తారు. ఆమె చిన్నతనంలోనే చూపును కోల్పోయినప్పటికీ.. ఆ తర్వాత దేవుడు తనకు భవిష్యత్తును చూసే అరుదైన బహుమతిని ఇచ్చాడని పేర్కొన్నారు. ఆమె 1996లో మరణించారు. తన జీవించి ఉన్నకాలంలో బాబా వాంగ భవిష్యత్ విషయాలపై అనేక అంచనాలు వేశారు. వాటిలో చాలావరకు నిజమయ్యాయని చాలా మంది నమ్మకం. ప్రపంచ అంతం విషయంపైకూడా ఆమె ఓ సంవత్సరం చెప్పారట. 5079 సంవత్సరంలో ప్రపంచం అంతమవుతుందని ఆమె చెప్పినట్లు ప్రచారంలో ఉంది. ఇక 2023లో ఏం జరుగుతుందో? ప్రపంచంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఆమె తన భవిష్యవాణిలో చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.

Baba Vanga 2022: బాబా వంగా జోస్యం.. 2022లో జరగబోయేది ఇదే

2023లో ఏం జరుగుతుంది..?

2023 సంవత్సరంలో భూమిపై పలు విపత్తులు చోటుచేసుకుంటాయని బాబా వంగ తన భవిష్యవాణిలో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే గతంలో ఆమె చెప్పిన వాటిలో చాలా వరకు జరగడంతో 2023లో కూడా ఆమె భవిష్యవాణిలో పేర్కొన్న ఘటనలు కళ్లముందు సాక్షాత్కారమయ్యే అవకాశాలు ఎక్కువ అని చాలామంది నమ్మకం. 2023 చీకటి మయంగా ఉంటుందని, గ్రహాంతర వాసుల దాడి, సౌర సునామీ ఇలా అనేక విపత్తులు ముంచుకొస్తున్నాయని ఆమె తన భవిష్యవాణిలో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆమె చెప్పిన వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే..

♦  ఒక పెద్ద దేశం ప్రజలపై బయో ఆయుధాల పరిశోధనను నిర్వహిస్తుందని అంచనా వేసినట్లు నమ్ముతారు. ఇది వేలాది మంది మరణానికి దారితీయవచ్చు. ఐక్యరాజ్యసమితి యొక్క బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ అటువంటి ప్రయోగాలను సమర్థవంతంగా నిషేధించింది. అయినప్పటికీ, అనేక దేశాలు సంభావ్య బయోవెపన్స్ విభాగాలను రహస్యంగా నడుపుతున్నాయని భయపడుతున్నాయి.

♦  2023 సంవత్సరంలో సౌర తుఫాను, సౌర సునామీ సంభవిస్తుందట. ఇది గ్రహం యొక్క అయస్కాంత కవచాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందట.

♦  2023 సంవత్సరంలో ప్రపంచం మొత్తం చీకటిలో కప్పబడి ఉంటుంది. గ్రహాంతర వాసులు భూమిపై దాడి చేయవచ్చు. లక్షలాది మంది ప్రజలు చనిపోయే అవకాశాలు ఎక్కువ.

♦  అణు విద్యుత్ ప్లాంట్‌లో పేలుడు సంభవించవచ్చు. దీని కారణంగా విషపూరిత వాయువు ఆసియా ఖండాన్ని కప్పివేస్తాయి. ఫలితంగా అనేక దేశాల్లోని ప్రజలు తీవ్రమైన వ్యాధుల బారినపడతారు.

♦  2023 సంవత్సరంలో సహజంగా పిల్లలను కనడం తక్కువ అవుతుందట. ల్యాబ్ ద్వారా పిల్లలను కనడానికి ఎక్కువ మంది ప్రజలు మొగ్గు చూపుతారట. ఎవరు పుట్టాలనే విషయాన్ని ప్రపంచాది నేతలు, డాక్టర్లే నిర్ణయిస్తారట. ఈ పద్ధతిలో తల్లిదండ్రులు తమకు పుట్టబోయే పిల్లల వెంట్రుకలు, కళ్ల కలర్‌లను ముందే నిర్ణయించడానికి వీలవుతుందట.

అయితే కొందరు మాత్రం వీటిని కొట్టిపారేస్తున్నారు. కేవలం ఇవి ఓ వ్యక్తి  (బాబా వాంగ ) ఊహించుకొని చెప్పిన అంచనాలే అని, ఇవి జరుగుతాయని చెప్పలేమని పేర్కొంటున్నారు.