Small Cow : ప్రపంచంలో చిన్న ఆవు ఇదే!

ఓ లేగదూడ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి కారణం అది పొట్టిగా ఉండటమే.. బంగ్లాదేశ్ లోని చారిగ్రామ్‌లోని ఓ గో సంరక్షణ కేంద్రంలో ఈ ఆవు దూడ ఉంది. దీని వయసు 23 వారలు, దీని ఎత్తు 21 అంగుళాలు (51 సెంటీమీటర్లు).. భూటాన్ జాతికి చెందిన ఈ ఆవును రాణి అని ముద్దుగా పిలుచుకుంటారు.

Small Cow : ప్రపంచంలో చిన్న ఆవు ఇదే!

Small Cow

Small Cow : ఓ లేగదూడ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి కారణం అది పొట్టిగా ఉండటమే.. బంగ్లాదేశ్ లోని చారిగ్రామ్‌లోని ఓ గో సంరక్షణ కేంద్రంలో ఈ ఆవు దూడ ఉంది. దీని వయసు 23 వారలు, దీని ఎత్తు 21 అంగుళాలు (51 సెంటీమీటర్లు).. భూటాన్ జాతికి చెందిన ఈ ఆవును రాణి అని ముద్దుగా పిలుచుకుంటారు.

అతి చిన్న ఆవుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటుసంపాదించిన భారత్ కు చెందిన మాణిక్యం అనే అవుకంటే ఇది 3 అంగుళాలు తక్కువగా ఉంది. మాణిక్యం వేచూర్ జాతి ఆవు.. దీని ఎత్తు కేవలం 24 అంగుళాలు. దీన్ని బట్టి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు ప్రతినిధులు కనుక పరిశీలిస్తే కచ్చితంగా మాణిక్యం రికార్డును రాణి ఎత్తుకుపోతుందని దాని యజమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈ ఆవును చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ ఎత్తున ప్రజలు వస్తున్నారు.. దీంతో దాని యజమాని ఆందోళన చెందుతున్నారు. కరోనా కేసులు విపరీతంగా ఉన్నాయని. దీనిని చూసేందుకు వచ్చిన వారు కరోనా నిబంధనలు మరిచి వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రజలకు చెప్పినా వినడం లేదని తెలిపాడు.