GIF Creator Steve Wilhite : GIF ఫార్మాట్ క్రియేటర్ స్టీవ్ విల్‌హైట్ ఇకలేరు..!

GIF Creator Steve Wilhite : కంప్యూటర్‌పై అవగాహన ఉన్న ప్రతిఒక్కరికి జిఫ్ (GIF) ఫార్మాట్ గురించి తెలిసే ఉంటుంది. కంప్యూటర్లలో సేవ్ చేసుకునే ఇమేజ్‌ల్లో అనేక ఫార్మాట్లు ఉంటాయి.

GIF Creator Steve Wilhite : GIF ఫార్మాట్ క్రియేటర్ స్టీవ్ విల్‌హైట్ ఇకలేరు..!

Beloved Creator Of The Gif Dies Following Complications From Covid, Wife Confirms

GIF Creator Steve Wilhite : కంప్యూటర్‌పై అవగాహన ఉన్న ప్రతిఒక్కరికి జిఫ్ (GIF) ఫార్మాట్ గురించి తెలిసే ఉంటుంది. సాధారణంగా కంప్యూటర్లలో సేవ్ చేసుకునే ఇమేజ్‌ల్లో అనేక ఫార్మాట్లు ఉంటాయి. ఎక్కువగా వినియోగంలో ఉంటే ఇమేజ్ ఫార్మాట్లలో JPEG ఫార్మాట్ ఒకటి.. ఇలాగే GIF, PNG వంటి అనేక ఇమేజ్ ఫార్మాట్లు ఉన్నాయి. ఇందులో GIF ఫార్మాట్ ఒక యానిమేటెడ్ ఇమేజ్ ఫార్మాట్.. అయితే ఈ GIF ఫార్మాట్ సృష్టించిన క్రియేటర్ అయిన స్టీవ్ విల్ హైట్ (74) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన భార్య కాథలీన్ (Kathaleen Wilhite) ధృవీకరించారు.

కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆయన ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడ్డారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం మరింత క్షీణించి మరణించారు. మార్చి 14న స్టీవ్ విల్ హైట్ కరోనాతో మరణించారు. కానీ, ఈ వార్త ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మార్చి మొదటివారంలో కరోనావైరస్ బారిన పడ్డారు. కరోనా చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన ఆయన కోలుకున్న అనంతరం తలెత్తిన అనారోగ్య సమస్యలతో మరణించారు. జిఫ్ ఫార్మాట్.. అని 1987లో ఆయన అనుకోకుండా అన్న పదమే ప్రపంచమంతా అదే పేరుతో పిలుస్తోంది. అప్పటికే ఇంటర్నెట్ రావడంతో ఈ GIF వినియోగం మరింత పెరిగింది తద్వారా అనేక ఫార్మాట్‌లలో ఇదొకటిగా మారింది. 2013లో ది వెబ్బీ అవార్డ్స్‌లో విల్‌హైట్ పురస్కారాన్ని అందుకున్నారు.

విల్‌హైట్‌ మొదటి GIF ఒక విమానం ఫొటో అని చెప్పాడు. దీని గ్రాఫిక్స్ ఫార్మాట్ 1987లో తిరిగి విడుదల చేశారు. GIF మెరుగుపరిచిన వెర్షన్ 87aగా పిలిచారు. ఈ ఫార్మాట్‌ యానిమేషన్‌లను క్రియేట్ చేయడానికి అనుమతించనున్నారు. ఆ తర్వాత నుంచి ఈ GIF ఫార్మాట్ ఇంటర్నెట్‌లో మీమ్స్ క్రియేషన్ల మోడ్‌గా మారింది. 1980లో గ్రాఫిక్స్‌ ఇంటర్‌చేంజ్‌ ఫార్మాట్’ను ఆయన సృష్టించారు. ఆ సమయంలో అనారోగ్యం కారణంగా పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. 1998లో కంపు సర్వ్’ (CompuServe)ని AOL చేజిక్కించుకుంది. ఆ తర్వాత, GIF పేటెంట్ల గడువు ముగిసింది. అప్పటినుంచి ఈ GIF ఫార్మాట్ పబ్లిక్ డొమైన్‌లోకి అందుబాటులోకి వచ్చింది.

Read Also : Airtel Xstream Box price : రూ.2 వేలకే ఎయిర్ టెల్ Xstream బాక్స్.. ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ కూడా..!