United States : బైడెన్ కొలువులో రవి చౌదరికి కీలక పదవి

జో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత భారత సంతతి వ్యక్తులకు మంచి పదవులు లభిస్తున్నాయి. ఇప్పటికే అనేక మంది భారత సంతతికి చెందిన వ్యక్తులు కీలక పదవుల్లో ఉన్నారు.

United States : బైడెన్ కొలువులో రవి చౌదరికి కీలక పదవి

United States

United States : జో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత భారత సంతతి వ్యక్తులకు మంచి పదవులు లభిస్తున్నాయి. ఇప్పటికే అనేక మంది భారత సంతతికి చెందిన వ్యక్తులు కీలక పదవుల్లో ఉన్నారు. భారత సంతతి వ్యక్తులకు బైడెన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. బైడెన్ వ్యక్తిగత సలహాదారుల్లో ఒకరు భారత సంతతి వ్యక్తి ఉన్నారు. ఇక తాజాగా మరో భారత సంతత వ్యక్తి పేరును ఓ కీలక పదవికి ప్రతిపాదించాడు బైడెన్. గతంలో అమెరికా వాయుసేనలో పనిచేసిన రవి చౌదరి అనే వ్యక్తి పెంటగాన్‌లోని ‘ఎయిర్‌ఫోర్స్‌ ఫర్‌ ఇన్‌స్టల్లేషన్స్‌ అండ్‌ ది ఎన్విరాన్‌మెంట్‌’ విభాగానికి అసిస్టెంట్‌ సెక్రటరీ హోదాకు అర్హుడని బైడెన్‌ తెలిపారు.

చదవండి :  అమెరికా సైనికుల్లో ఆత్మహత్యలు ఎక్కువ..ఎందుకంటే?

రవి చౌదరి గతంలో ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌ఏఏ)లో అడ్వాన్స్‌డ్‌ ప్రోగ్రామ్స్‌ ఇన్నోవేషన్‌ విభాగానికి డైరెక్టర్‌గా పనిచేశారు. 1993-2015 వరకు వాయుసేనలో వివిధ హోదాల్లో పనిచేశారు. సీ-17 యుద్ధ విమాన పైలట్‌ అయిన రవి.. అఫ్గానిస్థాన్‌, ఇరాక్‌లో కీలక ఆపరేషన్లలో పాల్గొన్నారు. ఇక బైడెన్ ప్రతిపాదనను సెనేట్ ఒకే చేస్తే రవి చౌదరి ‘ఎయిర్‌ఫోర్స్‌ ఫర్‌ ఇన్‌స్టల్లేషన్స్‌ అండ్‌ ది ఎన్విరాన్‌మెంట్‌’ విభాగానికి అసిస్టెంట్‌ సెక్రటరీగా నియమితులవుతారు.

చదవండి :   పక్షవాతం ఉందని చెప్పినా…జుట్టుపట్టి కిందకు లాగేసిన అమెరికా పోలీసులు