American Soldiers : అమెరికా సైనికుల్లో ఆత్మహత్యలు ఎక్కువ..ఎందుకంటే?

అమెరికాలో సైనికుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. కరోనా కంటే ఈ ఏడాది రెండో త్రైమాసికంలో అమెరికా మిలిటరీ సభ్యులు ఎక్కువ మంది ఆత్మహత్యలతో మరణించినట్లు పెంటగాన్‌ నివేదిక వెల్లడించింది.

American Soldiers : అమెరికా సైనికుల్లో ఆత్మహత్యలు ఎక్కువ..ఎందుకంటే?

America

American soldiers Suicides : అమెరికాలో సైనికుల ఆత్మహత్యలు ప్రతి మూడు నెలలకు పెరిగిపోతున్నాయి. కరోనా కంటే ఈ సంవత్సరం రెండో త్రైమాసికంలో అమెరికా మిలిటరీ సభ్యులు ఎక్కువ మంది ఆత్మహత్యలతో మరణించినట్లు పెంటగాన్‌ నివేదిక వెల్లడించింది. ఇది చాలా ఆందోళనకరమైన విషయమని వాపోయింది.  ఏప్రిల్ ఆరంభం నుంచి జూన్ చివరి వరకు, మొత్తం 139 మంది సైనికులు సూసైడ్‌ చేసుకున్నారు.

ఇందులో 99 మంద సైనికులు యాక్టివ్‌గా దేశ సేవలో విధులు నిర్వహిస్తున్నవారే ఉన్నారు. 2020 రెండో త్రైమాసికంలో కంటే 46శాతం మేర ఆత్మహత్యలు పెరిగాయి. కరోనా కారణంగా ఇప్పటివరకు అమెరికా వ్యాప్తంగా 58మంది సైనికులు చనిపోగా.. సూసైడ్‌ల సంఖ్య మాత్రం దాని కంటే రెండున్నర రెట్లు ఎక్కువగా ఉంది.

Black Death : మానవాళికి ముంచుకొస్తున్న మరో ముప్పు

30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న సైనికులే ఈ ఆత్మహత్యలకు ఎక్కువగా చేసుకుంటున్నారు. మొత్తం సైనిక ఆత్మహత్యల్లో 63 శాతం వరకు 30ఏళ్ల లోపు వారే ఉన్నారు. ప్రతి లక్ష మంది సైనికుల్లో సగటున 36మంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నివేదిక తెలిపింది.

ఇక త్వరలో రానున్న మూడో త్రైమాసికం రిపోర్టులో ఆత్మహత్యకు పాల్పడ్డ సైనికుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే జులై తర్వాతే అఫ్ఘాన్‌లో అమెరికా భద్రత దళాల ఉపసంహరణ పూర్తయింది. ఈ మూడు నెలల్లో చాలా మంది అమెరికా సైనికులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారని నివేదికలు చెబుతున్నాయి.