Bill Gates – Jeff Bezos: మూడేళ్లుగా ఆ కంపెనీలో బిల్ గేట్స్.. జెఫ్ బెజోస్ పెట్టుబడులు

ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే. ఈ క్రమంలోనే ఎలన్‌మస్క్‌కు చెందిన టెస్లా కార్లకు అంత డిమాండ్ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ కార్లను రిలీజ్‌...

Bill Gates – Jeff Bezos: మూడేళ్లుగా ఆ కంపెనీలో బిల్ గేట్స్.. జెఫ్ బెజోస్ పెట్టుబడులు

Tesla Car

Bill Gates – Jeff Bezos: ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే. ఈ క్రమంలోనే ఎలన్‌మస్క్‌కు చెందిన టెస్లా కార్లకు అంత డిమాండ్ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ కార్లను రిలీజ్‌ చేసి సక్సెస్ అయ్యాడు కూడా. టెస్లా కార్లు ఒక్కసారి ఛార్జ్‌చేస్తే 600 కిలోమీటర్లమేర ప్రయాణిస్తాయి. ఎలక్ట్రిక్‌ వాహనాల రేంజ్‌ అనేది ఆయా వాహనాల మెటల్‌ బాడీపై ఆధారపడి ఉంటుంది.

అత్యంత శక్తివంతమైన, మన్నికైన, తేలికైన, నాణ్యమైన మెటల్‌ బాడీల మ్యాన్యుఫ్యాక్చరింగ్ కోసం రీసెర్చ్‌లు మొదలుపెట్టారు. ఎలక్ట్రిక్‌ వాహనాల్లో వాడే లోహాలకోసం చేపట్టే పరిశోధనలకు పెట్టుబడులు వెచ్చించారు. ఇందులో ప్రపంచ బిలియనీర్లు అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌, మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ కోబోల్డ్‌‌లు మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ స్టార్టప్‌లో మూడేళ్లుగా భారీ మొత్తంలో నిధులను ఇన్వెస్ట్‌చేశారట.

కోబోల్ట్‌ స్టార్టప్‌, బీహెచ్‌పీ కంపెనీ భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే లోహలను వెతకడం కోసం రీసెర్చ్‌లను చేపట్టారు. అందించే లోహలు ప్రాథమికంగా టెస్లా కార్ల తయారీకి ఉపయోగపడనుంది. కోబోల్డ్ మెటల్స్, బీహెచ్‌పీ టీంలు కలిసి ఆస్ట్రేలియాలోని లిథియం, నికెల్, కోబాల్ట్, రాగి కోసం వెదుకుతాయని కోబోల్డ్ సీఈఓ కర్ట్ హౌస్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

టెస్లా కార్ల బ్యాటరీలో వాడే నికెల్‌ కోసం టెస్లాతో బీహెచ్‌పీ కంపెనీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ఉపయోగించి ఈవీ వాహనాల లోహలకోసం కోబోల్డ్‌ మెటల్స్‌ వెదకడం మొదలుపెట్టనున్నాయి. ఎనర్జీ వెంచర్స్‌ ద్వారా మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌, అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌తో పాటుగా బ్లూమ్‌బర్గ్‌ వ్యవస్థాపకుడు మైఖేల్‌ బ్లూమ్‌బర్గ్‌ ఈ కంపెనీల్లో పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది.

ఎంతమేర పెట్టుబడిపెట్టారనే విషయంపై కోబోల్ట్‌ సవివరంగా తెలియజేయలేదు. ఈవీ వాహనాల లోహల రీసెర్చ్‌ల కోసం 14 మిలియన్‌ డాలర్లను ఖర్చుచేయనున్నారు.

Read Also: Digvijay Singh: మహిళలకు స్థానం కల్పించడంలో ఆర్ఎస్ఎస్.. తాలిబాన్లు సమానమే