లక్షలాది పక్షుల్ని చంపేస్తున్న చెట్టు..గింజలతో గిలగిలలాడుతున్న పిట్టల ప్రాణాలు

లక్షలాది పక్షుల్ని చంపేస్తున్న చెట్టు..గింజలతో గిలగిలలాడుతున్న పిట్టల ప్రాణాలు

Bird Catcher Tree Pisonia

Bird Catcher Tree Pisonia : చెట్టుమీద పిట్ట. పిట్టల ద్వారా పెరిగే చెట్లు. ఇది ప్రకృతి ధర్మం. అలా చెట్టుకు..పిట్లకు అవినావభావం సబంధం. పక్షులు చెట్లమీద గూడు కట్టుకుని బతుకుతాయి. ఆ పక్షులే చెట్ల సంఖ్య పెరగటానికి కారణమవుతాయి. అలా చెట్టుది పిట్టది అవినావభావం సంబంధం కొనసాగుతోంది ఈ ప్రకృతిలో. చెట్లకు కాసే కాయల్లోని గింజల్ని తిన్న పక్షులు ఎక్కడెక్కడో తిరుగుతుంటాయి. అలా గింజల్ని ఎక్కడెక్కడో వెదజల్లుటంతో చెట్లు పెరుగుతాయి. కానీ ఆ చెట్లే పక్షుల ప్రాణాల్ని తీస్తే..చెట్ల గింజలే పక్షులకు ప్రాణాంతకంగా మారితే..ఇక పిట్టల బతుకు ఎలా? ప్రశ్న తలెత్తుతుంది. చెట్ల గింజలు పక్షుల్ని చంపటమా? ఇది నిజమా? అనే డౌట్ వస్తుంది.

9

7

ఇది నిజమే..అలా ఓ చెట్టు తనపై గూడు కట్టుకోవటానికి..తనపై విశ్రాంతి తీసుకోవటానికి వస్తున్న పక్షల్ని చంపేస్తోంది..!! దీంతో ఆ చెట్టుని ‘బర్డ్‌ క్యాచర్‌’ అంటున్నారు. పక్షల్ని చంపే చెట్టు కథే ఇది.. ‘బర్డ్‌ క్యాచర్‌’ అనే పేరు తెచ్చుకున్న ఆ చెట్టు పేరు పిసోనియా. అన్ని చెట్లలా ఇది కూడా ఓ సాధారణ చెట్టే. కానీ ఆ చెట్టుకు కాసే కాయల గింజలు పక్షులు చనిపోవడానికి కారణమవుతున్నాయి. దానికి కారణం ఆ గింజలపై ఉండే జిగటలాంటి పదార్ధమే..

2

ఆఫ్రికా, ఇండో పసిఫిక్‌ ప్రాంతాల్లో పెరిగే ఈ పిసోనియా చెట్లు కూడా మిగతా సాధారణ చెట్లలానే ఉంటాయి. వీటికి పువ్వులు పూస్తాయి. అవికాయలవుతాయి. ఆ కాయలు పగిలి గుత్తులు గుత్తులుగా గింజలు బైటపడతాయి. ఈ గింజలు విషపూరితమైనవి కాదు. ఈ చెట్టు గింజలకు అంటుకుపోయే జిగురు లాంటి పదార్థం ఉంటుంది, దానిపై సన్నని కొక్కేల్లాంటివి ఉంటాయి.

6

దీంతో ఈ చెట్టుపై వాలిన ఏవైనా పక్షులు, పురుగులకు ఈ గమ్, కొక్కాలు ఉన్న గింజలు అంటుకుపోయి దూరంగా రాలిపోతాయి. అలా దూరంగా పడిన గింజలు మొలకెత్తి పిసోనియా చెట్లు పెరుగుతాయి. ఇలా చెట్లు, మొక్కల జాతులు విస్తరించడం ప్రకృతిలో సహజమే. కానీ ఇక్కడే ఓ ఉపద్రవం ఉంది. ఆ జిగురే పక్షుల మరణాలకు కారణమవుతోంది.

4

పిసోనియా చెట్ల గింజలకు ఉండే జిగురు చాలా పవర్‌ఫుల్‌. పక్షులు ఈ చెట్టుమీద వాలినప్పుడు ఆ గింజలు వాటి ఈకలకు అతుక్కుంటాయి. గుత్తులు గుత్తులుగా గింజలు ఉంటాయి కాబట్టి.. పిట్టలకు తల దగ్గరి నుంచి తోక దాకా అంటుకుంటాయి. వాటి బరువు వల్ల, ఈకలు అతుక్కుపోవడం వల్ల పక్షులు ఎగరలేకపోతాయి. ఎగిరినా కొంత దూరంలో కిందపడిపోతాయి. గింజలు ఎక్కువగా అతుక్కుంటే పెద్దగా కదల్లేని స్థితిలో పడిపోతాయి. చివరికి ఆహారం లేక చనిపోతాయి.

10

అలా పడిపోయి ఎగరలేని స్థితిలో ఉండే పక్షుల్ని ఏ గద్దలో..పాములో..లేదా ఇతర జంతువులో తినేస్తాయి. పిట్టలు, చిన్న చిన్న పక్షులు అయితే.. పిసోనియా గింజల గుత్తులకు అలాగే అంటుకుపోతాయి. అలా వేలాడుతూనే చనిపోతాయి. చాలా చోట్ల పిసోనియా చెట్లకు పక్షుల డెడ్‌బాడీలు, అస్థి పంజరాలు వేలాడుతూ కనిపిస్తాయి. అందుకే వీటిని ‘బర్డ్‌ క్యాచర్స్‌’ అని పిలుస్తుంటారు.

1

పచ్చగా కనిపించే పిసోనియా చెట్లంటే.. పక్షులకు ఎంతో ఇష్టం
పిసోనియా చెట్ల కారణంగా ప్రాణాలు పోతున్నా కూడా.. చాలా రకాల పక్షులకు ఈ చెట్లంటే ఎంతో ఇష్టపడతాయి. పక్షులు గూళ్లు పెట్టని పిసోనియా చెట్టు ఒక్కటి కూడా కనిపించదని వృక్ష శాస్త్రజ్నలు చెబుతుంటారు. సాధారణంగా సముద్ర పక్షులు వలస వచ్చే సమయంలోనే పిసోనియా చెట్లు పూలు పూసి, గింజలు ఏర్పడుతాయి. ఆ టైంలో వలస పక్షులు పిసోనియా చెట్లపై గూళ్లు కట్టుకుని పిల్లల్ని పెడతాయి. ఈ పక్షి పిల్లలకు కొన్ని గింజలు అంటుకున్నా కూడా కింద పడిపోతాయి.

11

సీషెల్స్‌ దేశంలోని కజిన్‌ ఐల్యాండ్స్‌లో విక్టోరియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ పరిశోధన చేశారు. పిసోనియా చెట్ల కారణంగా.. వైట్‌ టెర్న్స్‌ పక్షుల్లో నాలుగో వంతు, ట్రాపికల్‌ షీర్‌వాటర్స్‌ పక్షుల్లో పదో వంతు చనిపోతున్నాయని తేల్చారు. ఈ చెట్ల వల్లే ఏటా లక్షల సంఖ్యలో పక్షులు మరణిస్తున్నట్టు గుర్తించారు.