ఆమె క్యాన్సర్‌‌ను జయించింది.. అంతరిక్షాన్ని జయించేందుకు వెళ్తోంది!

ఆమె క్యాన్సర్‌‌ను జయించింది.. అంతరిక్షాన్ని జయించేందుకు వెళ్తోంది!

cancer winner Woman into space : క్యాన్సర్‌ మహమ్మారిని జయించటమంటే మాటలు కాదు..శారీరకంగా..మానసికంగా కృంగిపోతుంటారు క్యాన్సర్ బాధితులు. కానీ దాన్ని జయించి బ్రతకి బైటపడేవారు చాలా కొంతమందే ఉంటారు. ఆ తరువాత కూడా ఏదో భయంతో కూడిన జీవితాలనే గడుపుతుంటారు. కానీ క్యాన్సర్ మహమ్మారిని జయించిన ఓ మహిళ కొత్త జీవితాన్ని ప్రారంభించారు.అంతటితో ఊరుకోకుండా తన కలలను సాకారం చేసుకునే దిశగా పయనించటమే కాదు ఏకంగా అంతరిక్షంలో కాలు పెట్టనున్నారు 29 ఏళ్ల హేలే ఆర్సినాక్స్..

క్యాన్సర్ ను జయించిన 29 ఏండ్ల ఫిజిషియన్‌ అసిస్టెంట్‌ హేలే ఆర్సినాక్స్‌. ఈ సంవత్సరం చివరిలో స్పేస్‌ఎక్స్‌ చేపట్టే తొలి ప్రైవేట్‌ అంతరిక్ష యాత్ర ద్వారా రోదసిలోకి వెళ్లనున్నారు. బిలియనీర్‌ జేర్‌డ్‌ ఇసాక్‌మ్యాన్‌, మరో ఇద్దరితో కలిసి ఆమె అంతరిక్ష యాత్ర చేయనున్నారు.

సెయింట్‌ జ్యూడ్‌ చిల్డ్రన్‌ రీసెర్చ్‌ హాస్పిటల్‌లో పేషెంట్‌గా చేరిన హేలే.. ప్రస్తుతం అక్కడే పనిచేస్తున్నారు. 10 ఏళ్ల వయసులోఆమెకు అదే హాస్పిటల్ లో మోకాలి ఆపరేషన్ చేసి..టైటానియం రాడ్‌ను అమర్చారు. ఈ స్పేస్‌ మిషన్‌ ద్వారా ఇసాక్‌మ్యాన్‌.. సెయింట్‌ జ్యూడ్‌ దవాఖానకు విరాళాలు సేకరిస్తున్నారు. నాలుగు సీట్లలో ఒక సీటును హాస్పిటల్‌కు కేటాయించారు.

హేలే అంతరిక్షంలోకి వెళితే ఆమేనే అంతరిక్షంలోకి వెళ్లి అతి చిన్న వయస్సు మొదటి అమెరికన్ గా చరిత్ర సృష్టించనున్నారు. కాగా హేలే ఆర్సినాక్స్ ఎముకకు సంబంధించిన క్యాన్సర్ తో బాధపడేవారు. ఆ క్యాన్సర్ మహమ్మారిని జయించి కొత్త జీవితాన్ని ప్రారంభించారు.