వార్నీ?!..మూడు గంటల సేపు రైలును ఆపేసిన పిల్లి..

వార్నీ?!..మూడు గంటల సేపు రైలును ఆపేసిన పిల్లి..

cat on train roof causes three hour delay : లండన్‌లోని యుస్టన్ స్టేషన్‌లో ఎవరి పనులమీద వాళ్లు స్టేషన్ కొచ్చి ట్రైన్ ఎక్కారు. అది కరెంట్ తో నడిచే ఫాస్టెస్ ట్రైన్. ఇంకాసేపట్లో ట్రైను బయలుదేరనుంది. కానీ ఓ పిల్లి వల్ల ట్రైన్ కదలకుండా ఆపేశారు అధికారులు. అది మనదేశంలోలాగా సెంటిమెంట్ తో మాత్రం కాదు. ఎందుకంటే.. ఆ పిల్లి రైలుకు ఎదురుగా రాలేదు. ఏకంగా రైలు మీదకు ఎక్కి కూర్చుంది. అది కరెంట్‌తో పరుగులు తీసే ఫాస్టెస్ ట్రైన్ కావడం వల్ల పిల్లి ప్రాణాలకే కాకుండా ప్రయాణికులకూ ప్రమాదం ముంచుకొస్తుందనే భయంతో అధికారులు రైలును కదలకుండా నిలిపేశారు.

లండన్ యుస్టన్ నుంచి మంచెస్టర్‌కు ప్రయాణికులతో బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న అవంతి వెస్ట్ కోస్ట్ పెండలినో రైలు మీద తాపీగా కూర్చుని ఉన్న పిల్లిని అధికారులు చూశారు. ఆ సమయంలో రైలు నడిపితే పిల్లికే కాకుండా ప్రయాణికులకు సైతం ముప్పేనని భావించారు. వెంటనే ప్రయాణికులను దింపేసి వేరే రైల్లోకి తరలించారు.

ఆ తరువాత ఆ పిల్లిని రైలుమీదనుంచి దింపటానికి రైల్వే సిబ్బంది నానా అగచాట్లు పడ్డారు. దాన్ని కిందకు దింపటానికి పేచీ పెట్టింది. అటు పరుగులు పెడుతూ సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టింది. దాన్ని ఎలాగైనా దానికి ఎటువంటి ప్రమాదం రాకుండా ప్రాణాలతో పట్టుకోవాలని..సిబ్బంది ఎంతో ఓపికగా దానితో పాటు అటూ ఇటూ పరుగులు పెట్టారు. అలా మూడు గంటల పాటు సిబ్బందిని నానా తిప్పలు పెట్టిందా పిల్లి. ఎలాగైతేనే ఎట్టకేలకూ కష్టపడి ఆ పిల్లిని రైలు మీద నుంచి కిందకి దింపగలిగారు. అనంతరం ఆ రైలును రీషెడ్యూల్ చేసి నడిపారు అధికారులు.