China apps: చైనాతో సంబంధం ఉన్న 138 బెట్టింగ్, 94 రుణ యాప్ లను నిషేధించనున్న కేంద్రం
చైనాతో సంబంధం ఉన్న మరో 232 యాప్ ల నిషేధానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వాటిలో138 బెట్టింగ్ యాప్ లు, 94 రుణ యాప్ లు ఉన్నాయి. వాటిని నిషేధించడానికి చర్యలు తీసుకుంటోంది. అత్యవసర ప్రాతిపదికన ఆ యాప్ లను నిషేధించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పలు వివరాలు తెలిపాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు చైనా యాప్ లపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోనుంది.

China apps: చైనాతో సంబంధం ఉన్న మరో 232 యాప్ ల నిషేధానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వాటిలో138 బెట్టింగ్ యాప్ లు, 94 రుణ యాప్ లు ఉన్నాయి. వాటిని నిషేధించడానికి చర్యలు తీసుకుంటోంది. అత్యవసర ప్రాతిపదికన ఆ యాప్ లను నిషేధించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పలు వివరాలు తెలిపాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు చైనా యాప్ లపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోనుంది.
కొన్ని రోజుల క్రితమే ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు ఈ ప్రతిపాదనలు అందాయి. ఈ మేరకు వాటిపై నిషేధం విధించేందుకు ప్రక్రియను ప్రారంభించింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 69 మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు సంబంధించిన అంశం కావడంతో చైనా యాప్ లపై చర్యలు తీసుకుంటున్నారు.
చైనాతో సంబంధం ఉన్న బెట్టింగ్, రుణ యాప్ లు చేస్తున్న మోసాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదు వస్తున్నాయి. యాప్ నిర్వాహకులు తక్కువ రుణాన్ని ఇచ్చి, అధిక వడ్డీలు వసూలు చేస్తుండడం, ఇవ్వకపోతే వేధింపులకు గురి చేస్తుండడం వంటి ఘటనలు పెరిగిపోయాయి.
లోన్ యాప్ డౌన్ లోడ్ చేసుకున్న వారి కాంట్రాక్ట్ లిస్టును తస్కరించి, వారి బంధువులు, మిత్రులకు రుణ గ్రహీతల గురించి అసభ్యకర మెసేజ్ లు, ఫొటోలు పంపుతున్నారు. భారతీయులను సంస్థలకు డైరెక్టర్లుగా నియమించుకుని ఈ ఆగడాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు భరించలేక పలువురు ఆత్మహత్య చేసుకున్నారు.
AP Constable Exam Results : ఏపీ కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు విడుదల