Pakistan Crisis: ఎట్టకేలకు అప్పు దొరికింది.. రూ.5.8 వేల కోట్లు ఇవ్వనున్న చైనా

పాకిస్థాన్ కు ఎట్టకేలకు అప్పు దొరికింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాక్ కు అప్పు ఇవ్వడానికి ఏ దేశమూ ముందుకు రావడం లేదన్న విషయం తెలిసిందే. ఇప్పుడు పాకిస్థాన్ కు ఆ దేశ మిత్రదేశం చైనా రూ.5.8 వేల కోట్ల సాయాన్ని ప్రకటించింది. రెండు-మూడు రోజుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ కు చైనా ఆ నిధులను బదిలీ చేయనుందని పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ ఇవాళ చెప్పారు.

Pakistan Crisis: ఎట్టకేలకు అప్పు దొరికింది.. రూ.5.8 వేల కోట్లు ఇవ్వనున్న చైనా

Pakistan Crisis: పాకిస్థాన్ కు ఎట్టకేలకు అప్పు దొరికింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాక్ కు అప్పు ఇవ్వడానికి ఏ దేశమూ ముందుకు రావడం లేదన్న విషయం తెలిసిందే. ఇప్పుడు పాకిస్థాన్ కు ఆ దేశ మిత్రదేశం చైనా రూ.5.8 వేల కోట్ల సాయాన్ని ప్రకటించింది. రెండు-మూడు రోజుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ కు చైనా ఆ నిధులను బదిలీ చేయనుందని పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ ఇవాళ చెప్పారు.

బోర్డ్ ఆఫ్ చైనా డెవలప్ మెంట్ బ్యాంక్ (సీడీబీ) నుంచి ఆ నిధులు బదిలీ అవుతాయి. ఈ మేరకు సీడీబీ నుంచి అన్ని ప్రక్రియలను పూర్తి చేశామని ఇషాక్ దార్ చెప్పారు. దీని ద్వారా పాక్ విదేశీ మారక ద్రవ్యం పెరుగుతుందని అన్నారు. పన్నుల ద్వారా వచ్చే నిధులను పెంచడం కోసం పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన మరుసటి రోజే ఇషాక్ దార్ చైనా చేస్తున్న ఆర్థిక సాయాన్ని గురించి ప్రకటన చేయడం గమనార్హం.

పాక్ కు రుణాలు ఇవ్వాలంటే ఆ దేశం పలు లక్ష్యాలను చేరుకోవాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ షరతులు పెట్టింది. ఈ నేపథ్యంలో పాక్ నిన్న పన్నుల ద్వారా వచ్చే నిధులను పెంచడం కోసం బిల్లు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా దాన్ని ఆమోదింపజేసుకుంది.

పాకిస్థాన్ లో విదేశీ మారక ద్రవ్యం ఫిబ్రవరి 10 నాటికి కేవలం రూ.26 వేల కోట్లు మాత్రమే ఉంది. మూడు వారాల దిగుమతులకు మాత్రమే ఇవి సరిపోతాయి. తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోతున్న పాకిస్థాన్ లో నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. అప్పులు చేయడం తప్ప మరో మార్గం పాక్ కు కనపడడం లేదు.

Sapota Fruits : వేసవి కాలంలో రోజుకు రెండు సపోటా పండ్లు తింటే చాలు…మంచి ఆరోగ్యం మీ సొంతం!