China : చైనా కొత్త ప్రాజెక్ట్‌..మరో భూమి కోసం అన్వేషణ

భూమికి 32 కాంతి సంవత్సరాల దూరంలో సౌర వ్యవస్థ వెలుపల భూమి లాంటి నివాసయోగ్యమైన గ్రహాల కోసం వేట మొదలెట్టబోతోంది.

China : చైనా కొత్త ప్రాజెక్ట్‌..మరో భూమి కోసం అన్వేషణ

China Land

China new project : అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రగామి కావాలని కలలు కంటున్న చైనా… ఇపుడు మరో కొత్త ప్రాజెక్టు చేపట్టబోతోంది. ఏకంగా మరో భూమి కోసం అన్వేషించబోతోంది. ఈ ప్రాజెక్ట్ చేపడితే… నివాసయోగ్యమైన భూ గ్రహాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొదటి అంతరిక్ష యాత్ర కానుంది.

భూమికి 32 కాంతి సంవత్సరాల దూరంలో సౌర వ్యవస్థ వెలుపల భూమి లాంటి నివాసయోగ్యమైన గ్రహాల కోసం వేట మొదలెట్టబోతోంది. ఇందుకోసం అంతరిక్షంలో ప్రయాణించే టెలిస్కోప్ ద్వారా ఆకాశాన్ని సర్వే చేసేందుకు చైనా శాస్త్రవేత్తలు అంతరిక్ష ప్రాజెక్టును ప్రతిపాదించారు.

China Artificial Sun :కృత్రిమ సూర్యుడితో చైనా కొత్త రికార్డు..సహజ సూర్యుడి కంటే 5రెట్లు ఎక్కువే సాధించిన డ్రాగన్ దేశం

క్లోజ్‌బై హాబిటబుల్ ఎక్సోప్లానెట్ సర్వే పేరుతో రూపొందించబడిన ఈ ప్రాజెక్ట్‌ నిర్వహిస్తే… సూర్యుడిలాంటి నక్షత్రాల చుట్టూ నివాసయోగ్యమైన భూగోళ గ్రహాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొదటి స్పేస్ మిషన్ కానుంది.