China-Protests: చైనాలోని ప్రపంచంలోనే అతిపెద్ద యాపిల్ ఐఫోన్ ఫ్యాక్టరీ వద్ద కలకలం.. వీడియో వైరల్

 చైనాలోని ప్రపంచంలోనే అతిపెద్ద యాపిల్ ఐఫోన్ ఫ్యాక్టరీ వద్ద కలకలం చెలరేగింది. జెంగ్జౌలోని ఆ ‘ఫాక్స్‌కాన్ ప్లాంట్’ వద్ద వేలాది మంది ఉద్యోగులు నిరసన తెలిపి, భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. చైనా జీరో కొవిడ్ విధానాన్ని పాటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఫాక్స్‌కాన్ ప్లాంట్’ వద్ద కఠిన ఆంక్షలు విధించింది. చైనా ప్రభుత్వ తీరుతో ఉద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అందరూ ఒక్కసారిగా బయటకు రావడంతో యుద్ధ వాతావరణం నెలకొంది.

China-Protests: చైనాలోని ప్రపంచంలోనే అతిపెద్ద యాపిల్ ఐఫోన్ ఫ్యాక్టరీ వద్ద కలకలం.. వీడియో వైరల్

China-Protests: చైనాలోని ప్రపంచంలోనే అతిపెద్ద యాపిల్ ఐఫోన్ ఫ్యాక్టరీ వద్ద కలకలం చెలరేగింది. జెంగ్జౌలోని ఆ ‘ఫాక్స్‌కాన్ ప్లాంట్’ వద్ద వేలాది మంది ఉద్యోగులు నిరసన తెలిపి, భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. చైనా జీరో కొవిడ్ విధానాన్ని పాటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఫాక్స్‌కాన్ ప్లాంట్’ వద్ద కఠిన ఆంక్షలు విధించింది. చైనా ప్రభుత్వ తీరుతో ఉద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అందరూ ఒక్కసారిగా బయటకు రావడంతో యుద్ధ వాతావరణం నెలకొంది.

ఇందుకు సంబంధించిన వీడియోలను కొందరు పోస్ట్ చేశారు. ఫాక్స్‌కాన్ ప్లాంట్’ వద్ద ఉద్యోగులపై భద్రతా బలగాలు దాడి చేశారు. కొందరు ఉద్యోగుల తలలు, ముఖాలపై రక్తం కనపడింది. బయటకు వస్తున్న వారిని పోలీసులు కర్రలతో కొడుతూ బీభత్సం సృష్టించారు. ‘ఫాక్స్‌కాన్ ప్లాంట్’ నుంచి మరో ప్రాంతానికి వెళ్లకుండా వేసిన బారికేడ్లను నిరసనకారులు తోసుకుంటూ బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు.

తమకు సరైన సదుపాయాలు కల్పించకపోవడమే కాకుండా, వేతనాలు ఇవ్వడంలోనూ జాప్యం చేస్తున్నారని ఉద్యోగులు వాపోయారు. కొందరికి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని చెప్పారు. చైనా కఠిన కరోనా ఆంక్షలు విధిస్తుండడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు విసుగెత్తిపోయి ఆందోళనలకు దిగుతున్నారు. ప్రపంచం మొత్తం హెర్డ్ ఇమ్యూనిటీ కోసం ప్రయత్నిస్తుంటే చైనా మాత్రం జీరో కొవిడ్ విధానాన్ని పాటిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..