Taliban-China : కాబూల్ లో చైనా గేమ్ స్టార్ట్..తాలిబన్ ముఖ్య నేతలతో సమావేశం

  తాలిబన్ నేతలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది చైనా.

Taliban-China :  కాబూల్ లో చైనా గేమ్ స్టార్ట్..తాలిబన్ ముఖ్య నేతలతో సమావేశం

China Taliban

Taliban-China  తాలిబన్ నేతలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది చైనా. అప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ లో తాలిబన్ నేతలని చైనా దౌత్యవేత్తలు అధికారికంగా కలిసి వారితో చర్చలు జరిపారు. కాబూల్ లో..అప్ఘానిస్తాన్ లో చైనా రాయబారి వాంగ్ యు తాలిబన్ రాజకీయ కార్యాలయం డిప్యూటీ హెడ్ అబ్దుల్ సలామ్ హనఫితో తాజాగా భేటీ అయ్యారు. వీరి భేటీపై బుధవారం బీజింగ్ లో చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ మీడియాతో మాట్లాడుతూ..చైనా మరియు ఆఫ్ఘన్ తాలిబాన్‌లకు ఎలాంటి ఆటంకం లేదు మరియు సమర్థవంతమైన కమ్యూనికేషన్ మరియు సంప్రదింపులు ఉన్నాయని తెలిపారు. ముఖ్యమైన విషయాలను చర్చించడానికి కాబూల్ కాబూల్ సహజంగానే తమకు ముఖ్యమైన ఫ్లాట్ ఫాం మరియు ఛానల్ అని తెలిపారు. అయితే చైనా రాయబారి-తాలిబన్ నేత మధ్య జరిగిన చర్చల పూర్తి సారాంశాన్ని మాత్రం చైనా విదేశాంగశాఖ బయటపెట్టలేదు.

వారి భవిష్యత్తు మరియు గమ్యంపై అప్ఘానిస్తాన్ ప్రజల స్వాతంత్ర్య నిర్ణయాన్ని చైనా గౌరవిస్తుందని,అప్ఘాన్ నేతృత్వంలోని మరియు అప్ఘాన్ సొంత విధానం అమలుకి చైనా మద్దతిస్తుందని వాంగ్ వెన్ బిన్ తెలిపారు. అప్ఘానిస్తాన్ తో మంచి స్నేహం,సహకారం,మంచి సంబంధాల అభివృద్ధిని కొనసాగించాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. అప్ఘానిస్తాన్ లో శాంతి,దేశ పునర్నిర్మాణంలో నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు సిద్దమని తెలిపారు.

కాగా,కాబూల్ ని తాలిబన్లు ఆగస్టు-15న తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత పలు దేశాలు తమ ఎంబసీలను మూసివేసిన విషయం తెలిసిందే. అమెరికా,భారత్ సహా కొన్ని దేశాలు తమ దౌత్య కార్యాలయాలను మూసేయగా..చైనా,పాకిస్తాన్,రష్యా దేశాలు మాత్రం తమ ఎంబసీలను తెరిచే ఉంచాయి. అయితే గతనెలలోనే చైనా తమ అప్ఘానిస్తాన్ ప్రత్యేక ప్రతినిధిని మార్చిన విషయం తెలిసిందే. లియి జియాన్ ని అప్ఘాన్ ప్రత్యేక ప్రతినిధిగా తొలగించి..ఆయన స్థానంలో గతంలో ఖతార్,ఐర్లాండ్,జోర్డాన్ దేశాల రాయబారిగా పనిచేసిన యు షియావో యోంగ్ ని తమ అప్ఘానిస్తాన్ ప్రత్యేక ప్రతినిధిగా చైనా నియమించింది.

ఇక,గత నెలలో తాలిబన్ ప్రతినిధి బృందం చైనా వెళ్లి..ఆ దేశ విదేశాంగశాఖ మంత్రితో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. చైనా వెళ్లిన తాలిబన్ బృందంలో ప్రస్తుతం అప్ఘానిస్తాన్ అధ్యక్ష బాధ్యతలు చేపడతాడని భావిస్తున్న తాలిబన్ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరాదర్ కూడా ఉన్నారు. ఉగ్ర గూపులతో ముఖ్యంగా చైనాలోని జియాంజిగ్ కేంద్రంగా ఈస్ట్ తుర్కుమెనిస్తాన్ ఇస్లామిక్ మూమెంట్(ETIM) పేరుతో ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఉయిఘర్ ముస్లిం మిలిటెంట్ గ్రూప్ తో సంబంధాలను తెంచుకోవాలని బరాదర్ తో చర్చల సమయంలో చైనా విదేశాంగమంత్రి కోరినట్లు సమాచారం. ETIMని అప్ఘానిస్తాన్ భూభాగం నుంచి కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు తాలిబన్ అనుమతివ్వదని బరాదర్..చైనా విదేశాంగ మంత్రికి హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అప్ఘానిస్తాన్ లో చైనా పెట్టుబడులు పెట్టాలని బరాదర్ కోరినట్లు సమాచారం.