China Vaccination for Above 3 Years : మూడేళ్ల చిన్నారులకు టీకా వేసేందుకు చైనా ప్రయత్నాలు

దేశంలో మూడోంతుల మందికి కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు వేసిన చైనా ఇప్పుడు  3-11 ఏళ్ల మధ్య వయస్సు కల వారికి కూడా టీకా వేయాలని నిర్ణయించుకుంది. 

China Vaccination for Above 3 Years : మూడేళ్ల చిన్నారులకు టీకా వేసేందుకు చైనా ప్రయత్నాలు

China Vaccine For Above 3 Years

China Vaccination for Above 3 Years :  దేశంలో మూడోంతుల మందికి కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు వేసిన చైనా ఇప్పుడు  3-11 ఏళ్ల మధ్య వయస్సు కల వారికి కూడా టీకా వేయాలని నిర్ణయించుకుంది.  దీన్ని మొదటగా దేశంలోని ఐదు ప్రావిన్స్‌లలో   అమలు చేయాలని చూస్తోంది.  దేశంలోని ఆ ప్రావిన్స్‌లలో  కొత్తగా  వస్తున్న కరోనా  కేసుల  కారణంగా ఈ ప్రక్రియ  చేపట్టబోతున్నట్లు  చైనా  తెలిపింది.

హుబే, ఫుజియాన్, హైనాన్, జెజియాంగ్, హునాన్‌ ప్రావిన్స్‌ల లోని అధికార యంత్రాంగం చిన్నారులకు టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందుకోసం దేశీయంగా తయారైన  సినోఫాం, సినోవాక్‌ టీకాలకు ప్రభుత్వం అనుమతులిచ్చింది.  ఈ వ్యాక్సిన్లను  చిలీ, అర్జెంటీనా,  కాంబోడియా ప్రభుత్వాలు తమ దేశాల్లోని  చిన్నారులకు ఇవ్వడం ప్రారంభించాయి.

Also Read : Coiveshield Vaccine : బహిరంగ మార్కెట్లో కోవిషీల్డ్ అమ్మకాల కోసం సీరం దరఖాస్తు

ప్రపంచంలోనే   అత్యధికంగా  140 కోట్లున్న  చైనా జనాభాలో 100 కోట్ల మందికి పైగా అంటే 76% మందికి   దేశీయంగా తయారైన సినోఫాం, సినోవాక్‌ టీకాలను పంపిణీ చేసింది. ఈ రెండు టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.  అయినప్పటికీ ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌ విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. డెల్టా వేరియంట్‌ నుంచీ కూడా  సినోఫాం, సినోవాక్‌ రక్షణ కల్పిస్తున్నాయని చైనా చెపుతోంది.