China Warns US: ఆ విషయంలో తలదూర్చొద్దు.. అమెరికా అధికారులకు చైనా వార్నింగ్..

2021 సంవత్సరం మొత్తం చైనా వాస్తవాధీన రేఖ వెంట బలగాల మోహరింపులు, నిర్మాణాలను కొనసాగించిందని పెంటగాన్ పేర్కొంది. చర్చల్లో పురోగతి నిధానంగా ఉందని అభిప్రాయ పడింది. ఇరు పక్షాలు ఆధిపత్యాన్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదని తెలిపింది.

China Warns US: ఆ విషయంలో తలదూర్చొద్దు.. అమెరికా అధికారులకు చైనా వార్నింగ్..

India vs China

China Warns US: అమెరికా అధికారులకు చైనా వార్నింగ్ ఇచ్చింది. భారత్‌తో తమ సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని ఈ హెచ్చరికలు చేసినట్లు పెంటగాన్ తన వార్షిక నివేదికలో పేర్కొంది. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి భారతదేశంతో చైనా ప్రతిష్టంభన నేపథ్యంలో భారతదేశం – అమెరికా సన్నిహిత సంబంధాల కారణంగా ఉధ్రిక్తతలు పెరగడానికి కారణం కావద్దని చైనా కోరింది. పీఆర్‌సీ (పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా) సరిహద్దు ఉద్రిక్తతలను నిరోధించేందుకు భారత్ అమెరికాతో మరింత సన్నిహిత భాగస్వామ్యాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తోందని, భారత్‌తో పీఆర్‌సీ సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దని పీఆర్‌సీ అధికారులు అమెరికా అధికారులను హెచ్చరించినట్లు పెంటగాన్ తన తాజా నివేదికలో పేర్కొంది.

China Corona Fears : వెంటిలేటర్లు, ఆక్సిజన్ మెషిన్లకు భారీగా పెరిగిన డిమాండ్.. చైనాలో కరోనా టెర్రర్

2021 సంవత్సరం మొత్తం చైనా వాస్తవాధీన రేఖ వెంట మోహరింపులు, నిర్మాణాలను కొనసాగించిందని పెంటగాన్ పేర్కొంది. చర్చల్లో పురోగతి నిధానంగా ఉందని అభిప్రాయ పడింది. ఇరు పక్షాలు ఆధిపత్యాన్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదని తెలిపింది. ఇరు దేశాలు సైనిక ఉపసంహరణలు జరగాలని చెబుతున్నా ఆచరణలో మాత్రం అవి సిద్ధంగా లేవని పెంటగాన్ వేదిక వెల్లడించింది.

China: చైనాలో కోవిడ్ నిబంధనల పేరుతో ఇంట్లోనే ఉంచి తాళం వేసిన అధికారులు.. అగ్ని ప్రమాదంలో ఆహుతైన కుటుంబం

మరోవైపు చైనా అణ్వాస్త్రాల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటోందని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే చైనా 400 అణువార్ హెడ్లను తయారు చేసిందని దానిలో పేర్కొంది. 2035 నాటికి అణ్వాస్త్రాల సంఖ్య మూడు రెట్లకుపైగా పెరిగి 1,500కు చేరుతుందని విశ్లేషించింది.