China: చైనాలో కోవిడ్ నిబంధనల పేరుతో ఇంట్లోనే ఉంచి తాళం వేసిన అధికారులు.. అగ్ని ప్రమాదంలో ఆహుతైన కుటుంబం

చైనాలో కఠినంగా అమలు చేస్తున్న కోవిడ్ నిబంధనల కారణంగా ఒక కుటుంబం అగ్నికి ఆహుతైంది. కోవిడ్ సోకిందని అధికారులు ఇంటికి తాళం వేశారు. ఆ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగి అందరూ ప్రాణాలు కోల్పోయారు.

China: చైనాలో కోవిడ్ నిబంధనల పేరుతో ఇంట్లోనే ఉంచి తాళం వేసిన అధికారులు.. అగ్ని ప్రమాదంలో ఆహుతైన కుటుంబం

China: చైనా కోవిడ్ నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక ప్రాంతంలో ఒక్కరికి కోవిడ్ సోకినా.. ఆ ప్రాంతంతోపాటు, చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ మూసేస్తోంది. కోవిడ్ సోకిన వారి ఇంటితోపాటు, చుట్టుపక్కల వారి ఇళ్లకు తాళాలు వేస్తోంది. ఇదే ఇప్పుడు మరో వివాదానికి కారణమైంది.

Twitter: ట్విట్టర్ బ్లూటిక్ అకౌంట్ల రీవెరిఫికేషన్.. ఈ వారమే ప్రారంభిస్తామంటున్న ఎలన్ మస్క్

కోవిడ్ నిబంధనల పేరుతో అపార్టుమెంట్లోని ఒక ఫ్లాట్‌కు తాళం వేశారు అధికారులు. అయితే, ఆ ఇంట్లో అగ్నిప్రమాదం జరగడంతో ఇంట్లోని వాళ్లంతా ప్రాణాలు కోల్పోయారు. ఇంటికి తాళం వేసి ఉంచిన కారణంగా లోపల ఉన్న కుటుంబ సభ్యులు తప్పించుకుని బయటకు రాలేని పరిస్థితి. దీంతో బాధిత కుటుంబం ప్రాణాలు అగ్ని ప్రమాదంలో ఇంట్లోనే కోల్పోయింది. చైనా, ఉరుంకి సిటీలో ఉయిగర్ ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 5-13 ఏళ్ల వయసు కలిగిన నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనపై స్థానికులు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ కఠిన ఆంక్షల వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రజలు విమర్శిస్తున్నారు.

YS Sharmila: షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి.. వైఎస్.విజయమ్మను అడ్డుకున్న పోలీసులు

ఈ ఘటనకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. కోవిడ్ నిబంధనల్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ విషయంలో అధికారులు మాత్రం తమ నిర్లక్ష్యం ఏమీ లేదని వాదిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు వచ్చే క్రమంలో రహదారిపై అడ్డుగా అనేక వాహనాలు ఉంచడం వల్లే సరైన సమయానికి అక్కడికి చేరుకోలేకపోయాని ఫైర్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు.