China Space Breeding : అంతరిక్షం నుంచి విత్తనాలు తెస్తున్న చైనా..పంట దిగుబడి భారీగా పెంచటానికి యత్నాలు

అంతరిక్షంలో వ్యవసాయం ... వినడానికే వింతగా ఉంది కదూ ! అసలు మట్టిలేని ప్రాంతంలో మొక్కలు ఎలా మొలుస్తాయన్న సందేహం కూడా వస్తుంది. జీరో గ్రావిటీలో మొక్కల పెంపకం సాధ్యం అవుతుందా ? అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు డ్రాగన్ కంట్రీ ప్రయత్నిస్తోంది. కానీ అక్కడితో ఆగలేదు చైనా..పంట అధిక దిగుబడులు పెంచటానికి అంతరిక్షం నుంచి విత్తనాలను తీసుకొచ్చి వినూత్న యత్నాలు చేస్తోంది చైనా.

China Space Breeding : అంతరిక్షం నుంచి విత్తనాలు తెస్తున్న చైనా..పంట దిగుబడి భారీగా పెంచటానికి యత్నాలు

China Space Breeding

China Space Breeding : అంతరిక్షంలో వ్యవసాయం … వినడానికే వింతగా ఉంది కదూ ! అసలు మట్టిలేని ప్రాంతంలో మొక్కలు ఎలా మొలుస్తాయన్న సందేహం కూడా వస్తుంది. జీరో గ్రావిటీలో మొక్కల పెంపకం సాధ్యం అవుతుందా ? అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు డ్రాగన్ కంట్రీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఇలాంటి ప్రయోగాల్లో నాసా శాస్త్రవేత్తలు చాలా వరకు పురోగతి సాధించారు. అంతకుమించి ఇంకేదో అద్భుతం చేయడానికి చైనా సైంటిస్టులు ట్రై చేస్తున్నారు.

చంద్రుడ్ని అందుకున్నాం… అంగారకుడిపై అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాం… ఆకాశానికే నిచ్చెనలు వేస్తున్నాం… అంతరిక్షంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాం… అక్కడే నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.. అయినా ఇంకా జవాబు లేని ప్రశ్నలు చాలానే ఉన్నాయి. మనిషి జీవించడానికి అవసరమైనవి ఆక్సిజన్, నీరు, ఆహారం. మనం ఎక్కడున్నా ఈ మూడు చాలా కీలకం. జీరో గ్రావిటీ ఉన్న అంతరిక్షంలో గాలి, నీరు ఉండదు. ఆహారం కావాలన్నా ఇక్కడి నుంచే తీసుకుపోవాలి. అంతేకానీ అక్కడే పండిచేస్తాం అంటే కుదరదు. ఆ వాతావరణంలో అది సాధ్యం కాదు. ఇంతవరకు మనకు తెలిసింది ఇదే.. ! కానీ అంతరిక్షంలోనూ ఏదైనా పండించొచ్చన్నది ఇప్పటికే నిరూపితం అయింది. నాసా సైంటిస్టులు అసలు మట్టితో పనిలేకుండానే పంటలు పండించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు చైనా కూడా దీనిపైనే ఫోకస్ పెట్టింది. కాకపోతే కొంచెం కొత్తగా ట్రై చేస్తోంది.

Also read : Scientists Warning: అంతరిక్షంలోకి మనుషులు వెళితే చంపుకుతినడం ఖాయం: శాస్త్రవేత్తలు

చైనా కొన్ని విత్తనాలను భూమి ఉప‌రిత‌లానికి 340 కిలోమీటర్ల పైన క‌క్ష్యలోకి తీసుకువెళ్లింది. అవి మైక్రో గ్రావిటీ ప‌రిస్థితుల్లో ఉంటాయి. అక్కడ కాస్మిక్ కిర‌ణాల దాడి తీవ్రంగా ఉంటుంది. ఆ కార‌ణంగా వాటిలో మార్పులు సంభ‌విస్తాయి. దాంతో ఈ ప్రక్రియ‌ను స్పేస్ మ్యుటజెనెసిస్‌గా వ్యవ‌హ‌రిస్తారు. సాధారణంగా కొన్ని ర‌కాల‌ మ్యుటేష‌న్ల కార‌ణంగా మొక్కలు అస‌లు పెర‌గ‌వు. అదే సమయంలో.. మ‌రికొన్ని ర‌కాల మ్యుటేష‌న్ల వ‌ల్ల మాత్రం వాటికి ప్రయోజ‌నం క‌లుగుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇలాంటి మ్యుటేషన్ల వల్ల ఆ విత్తనాలు ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకుని బతకగలవు. అంతేకాదు ఇవి త్వరగా పెరగడంతో పాటు తక్కువ నీటిని వినియోగించుకుంటాయి. దాంతోపాటు వాటి డీఎన్ఏలో స్వల్ప మార్పులు చేయడం వల్ల అవి కొత్త ల‌క్షణాలను క‌లిగి ఉంటాయి. క‌రువును ఎదుర్కొనే, కొన్ని ర‌కాల తెగుళ్లను త‌ట్టుకొనే శ‌క్తి వాటికి ఉంటుంది. అంత‌రిక్షంలో పెరిగిన ఆ మొక్కల విత్తనాల‌ను భూమిపైకి తిరిగి తీసుకొచ్చిన త‌రువాత చాలా జాగ్రత్తగా స్క్రీనింగ్ చేస్తారు. వాటిని నాటుతారు. వ‌చ్చిన‌ పంట నుంచి ఇక్కడికి పొలాల‌కు అనువైన విధంగా ఉండే విత్తనాల‌ను అభివృద్ధి చేస్తారు. అంటే చైనా ఉద్దేశం అంతరిక్షంలో వ్యవసాయం చేయడం కాదు. విత్తనాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లి వాటిని మరింత శక్తిమంతంగా తయారు చేయడం.

మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకుని మంచి దిగుబడులు రాబట్టడానికి ఈ త‌ర‌హా స్పేస్-బ్రీడింగ్‌ పద్దతిని చైనా ఫాలో అవుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో లుయువాన్ 502 ర‌కం గోధుమలు 11% అధిక దిగుడులు ఇస్తాయి. నీటి ఎద్దడిని తట్టుకుని మరి అధిక దిగుబడులు అందిస్తాయి. అంతేకాదు గోధుమకు సాధార‌ణంగా వచ్చే తెగుళ్లు వీటిని ఏమీ చేయలేవు. ఈ విత్తనాలను ఏ ప్రాంతంలో వేసినా వాటికి అనువుగా మార్చుకుంటాయి. నిజానికి ఇలాంటి స్పేస్-మ్యూటెడ్ క్రాప్ వెరైటీల‌ను సృష్టించడం ఇప్పుడే చైనా మొదలు పెట్టలేదు. 1987 నుంచి స్పేస్ మ్యుటజెనెసిస్‌పై చైనా ప్రయోగాలు చేస్తోంది. గ‌త 30 ఏళ్లలో 200కు పైగా స్పేస్-మ్యూటెడ్ క్రాప్ వెరైటీల‌ను సృష్టించింది.

Also raed : Nepal Tigers : నేపాల్ లో భారీగా పెరిగిన పులుల సంఖ్య..భయంతో వణికిపోతున్న ప్రజలు

అందులో ఒకటే ఈ లుయువాన్ 502 ర‌కం గోధుమ విత్తనం. కేవలం గోధుమలు మాత్రమే కాదు.. వ‌రి, మొక్క జొన్న‌, సోయా బీన్‌, ఆల్ఫాల్ఫా, నువ్వులు, ట‌మోటా, క్యాప్సికం.. ఇతర కూరగాయలను కూడా అంతరిక్షంలో పండించారు. 2006లో 152 జాతుల విత్తనాలు, మైక్రో ఆర్గానిజ‌మ్స్‌ని చైనా స్పెస్‌లోకి పంపింది. ఈ ఏడాది 12,000 విత్తనాలను అంత‌రిక్షంలో ఉన్న కేంద్రం నుంచి భూమికి తీసుకొచ్చింది. చైనాలో పంట దిగుబడులు భారీగా రావడానికి ఈ విత్తనాలే కారణం.నిజానికి ఈ తరహా ప్రయోగాలు అమెరికా, సోవియ‌ట్‌ యూనియన్‌లు చాలా ఏళ్ల క్రితమే మొదలుపెట్టాయి. కానీ ఈ విషయంలో ఇప్పుడు ముందుంది మాత్రం చైనానే ! అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.