క‌రోనా ఎఫెక్ట్… మ‌క్కా వెళ్లే భ‌క్తుల తాత్కాలిక వీసాలు ర‌ద్దు

మ‌క్కాకు వెళ్లే భ‌క్తుల‌పై క‌రోనా (కోవిడ్‌-19) వైరస్ ఎఫెక్ట్ పడింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతుండటంతో మ‌క్కా వెళ్లే భ‌క్తుల‌కు సౌదీ ఆరేబియా తాత్కాలిక వీసాల‌ను ర‌ద్దు చేసింది.

  • Published By: veegamteam ,Published On : February 27, 2020 / 10:18 AM IST
క‌రోనా ఎఫెక్ట్… మ‌క్కా వెళ్లే భ‌క్తుల తాత్కాలిక వీసాలు ర‌ద్దు

మ‌క్కాకు వెళ్లే భ‌క్తుల‌పై క‌రోనా (కోవిడ్‌-19) వైరస్ ఎఫెక్ట్ పడింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతుండటంతో మ‌క్కా వెళ్లే భ‌క్తుల‌కు సౌదీ ఆరేబియా తాత్కాలిక వీసాల‌ను ర‌ద్దు చేసింది.

మ‌క్కాకు వెళ్లే భ‌క్తుల‌పై క‌రోనా (కోవిడ్‌-19) వైరస్ ఎఫెక్ట్ పడింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతుండటంతో మ‌క్కా వెళ్లే భ‌క్తుల‌కు సౌదీ ఆరేబియా తాత్కాలిక వీసాల‌ను ర‌ద్దు చేసింది. ఈ మేరకు గురువారం (ఫిబ్రవరి 27, 2020) ఆ దేశ విదేశాంగ శాఖ వెల్ల‌డించింది. ఉమ్రా, మ‌హ్మద్ ప్ర‌వ‌క్త మ‌సీదు ద‌ర్శ‌నం కోసం వ‌చ్చే వారికి కొన్ని రోజుల పాటు వీసాల జారీని నిలిపివేయ‌నున్నారు. ప్ర‌తి నెల వేల సంఖ్య‌లో ముస్లిం భ‌క్తులు ఉమ్రా ద‌ర్శ‌నం కోసం సౌదీ వ‌స్తుంటారు. 

See Also>>చైనా టు ఇండియా : ఢిల్లీకి చేరుకున్న కరీంనగర్ జ్యోతి

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్‌.. మ‌హమ్మారిగా విజృంభిస్తోంది. దీంతో ప్ర‌పంచ దేశాల్లో కోవిడ్‌19 మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. అయితే కొత్త వైర‌స్ ప్ర‌మాద‌క‌రంగా ఉన్న క్రమంలో వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసిన‌ట్లు సౌదీ తెలిపింది. దేశ ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు విదేశాంగ శాఖ వెల్ల‌డించింది. క‌రోనా ప్ర‌బ‌లుతున్న దేశాల‌కు కూడా ఎవ‌రూ వెళ్ల‌కూడ‌ద‌ని దేశ ప్ర‌జ‌ల‌కు సౌదీ సూచించింది.

కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. కొవిడ్-19 వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు పొట్టన పెట్టుకుంది. దాదాపు 80వేల మంది వైరస్ బారిన పడ్డారు. తాజాగా అమెరికా మిలటరీ దళాలకు కరోనా ముప్పు పొంచి ఉంది. అమెరికా ఆర్మీకి చెందిన ఓ సైనికుడికి కరోనా సోకింది. దక్షిణ కొరియాలో విధులు నిర్వహిస్తున్న అమెరికన్ సోల్జర్ కరోనాతో బాధపడుతున్నాడు. అమెరికా మిలటరీలో తొలి కరోనా కేసు ఇదే. అమెరికా మిలటరీలో తొలి కరోనా కేసు వెలుగు చూడటం కలకలం రేపింది.