కరోనా డ్రాగన్ : 638 మంది మృతి

  • Published By: madhu ,Published On : February 7, 2020 / 07:51 AM IST
కరోనా డ్రాగన్ : 638 మంది మృతి

కరోనా వైరస్ చైనాను గడగడాలిస్తోంది. ఈ వైరస్ ఎప్పుడు పోతుందా ? అని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రధానంగా వుహాన్‌ శ్మశానంలా మారిపోయింది. వీధులన్నీ నిర్మానుష్యంగా కనపిస్తుండగా..ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి.

ఈ వైరస్ దాదాపు 30 దేశాల్లో విస్తరించినట్లు అంచనా వేస్తున్నారు. అయితే..చైనాలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 638 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. 2020, జనవరి 06వ తేదీ గురువారం ఒక్కరోజే..దాదాపు 73 మంది మరణించినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. మరో 31 వేల మందికి వైరస్ బారిన పడినట్లు అంచనా. 

వుహాన్‌‌లో 69 మంది చనిపోయారని, ఇక్కడ మరో 3 వేలకు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ వైరస్‌ను కట్టడి చేయాలని చైనా ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఆ ప్రయత్నాలన్నీ కొంతమటుకు విఫలమౌతున్నాయి. మరో 1500 పడకల ఆస్పత్రిని అక్కడి ప్రభుత్వం ప్రారంభించింది. చైనాకు ప్రయాణించడంపై విదేశాలు నిషేధం విధిస్తున్నాయి. 

* భారతదేశం ఈ వైరస్ పట్ల జాగ్రత్తలు తీసుకొంటోంది. 
* చైనాలో ఉన్న భారతీయులను ఇక్కడకు రప్పిస్తోంది. 
* వీరందరినీ ప్రత్యేకంగా వైద్య చికిత్సలు అందిస్తున్నారు. 

* దేశంలో ఉన్న చైనా వారికి చికిత్సలు చేయిస్తున్నారు. 
* చైనా నుంచి వస్తున్న కరోనా వైరస్ సంఖ్యలు అనుమానాస్పదంగా ఉన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ చేసింది. 

* సామాజిక, రాజకీయ మరియు ఆర్ధిక సమస్యలను వివరించే బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్న కైజింగ్ అనే స్వతంత్ర మ్యాగజైన్ కూడా కరోనా వైరస్ మృతుల సంఖ్యలో చైనా రిపోర్ట్ లు తప్పుగా ఉన్నట్లు తెలిపింది.