వేసవిలోనూ కరోనా బతికే ఉంటుంది, శీతాకాలంలో మళ్లీ వస్తుంది

  • Published By: veegamteam ,Published On : March 17, 2020 / 07:40 AM IST
వేసవిలోనూ కరోనా బతికే ఉంటుంది, శీతాకాలంలో మళ్లీ వస్తుంది

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి భారతీయులకు ఓ బ్యాడ్ న్యూస్. ఎండా కాలం వచ్చేసింది, అత్యధిక ఉష్ణోగ్రతల్లో కరోనా వైరస్ చచ్చిపోతుంది, ఇక కరోనా భయం తప్పినట్టే అని అంతా ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, నిపుణులు నీళ్లు చల్లారు. నిప్పుల కొలిమిని తలపించే వేసవిలోనూ కరోనా వైరస్ బతికే ఉంటుందట. అంతేకాదు వచ్చే ఏడాది శీతాకాలంలో మళ్లీ వైరస్ వస్తుందట. ప్రపంచ ఆరోగ్య సంస్థ, కరోనా వైరస్ పై అధ్యయనం చేస్తున్న నిపుణులు ఈ పిడుగు లాంటి విషయాన్ని చెప్పారు. సార్స్ రకానికి చెందిన కరోనా అత్యంత ప్రమాదకారి వైరస్ అని తెలిపారు. సార్స్(sars), మెర్స్(mers) తర్వాత దాని కన్నా ఎక్కువ ప్రభావం చూపించే వైరస్.. కరోనా అని నిపుణులు చెబుతున్నారు.

See Also | ‘కరోనా వల్లే ఏపీలో ఎన్నికలు వాయిదా వేయాల్సి వచ్చింది’..సీఎస్ కు రిప్లయ్ లేఖ రాసిన ఈసీ 

ముందు జాగ్రత్తలు పాటించాల్సిందే:
మనుషుల్లో ఇంకా కరోనా వైరస్ ను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి లేదు. దగ్గు, తుమ్ము తుంపర్ల ద్వారా, సన్నిహిత పరిచయం ద్వారా కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతూనే ఉంటుందని తెలిపారు. వాతావరణ పరిస్థితులపై ఆధారపడటం కన్నా,     ముందు జాగ్రత్తలు తీసుకోవడమే మేలని నిపుణులు చెబుతున్నారు. జన సమూహాలు ఎక్కువగా ఉండకుండా చూసుకోవడం బెటర్ అంటున్నారు. అంటువ్యాధులు మరింత ప్రబలకుండా ఇలాంటి చర్యలు చేపట్టాలని సూచించారు.

వేసవిలో కరోనా వైరస్ చస్తుందనే గ్యారంటీ లేదు:
దేశవ్యాప్తంగా అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇలాంటి హై టెంపరేచర్స్ లో కరోనా వైరస్ బతకదని అంతా నమ్మకం పెట్టుకున్నారు. అది నిజమే అనుకున్నా, వేసవిలో కరోనా వైరస్ తన ప్రభావం కోల్పోయినా, మళ్లీ వచ్చే శీతాకాలంలో కరోనా వైరస్ తిరిగి వస్తుందని నిపుణులు హెచ్చరించారు. ‘వేసవిలో కరోనా పోదు. మన ఫోకస్ అంతా కరోనా బాధితులను గుర్తించడం, వారిని క్వారంటైన్ లో ఉండచం మీద పెట్టాలి’ అని లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ప్రొఫెసర్ స్మిత్ చెప్పారు.

‘అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో కరోనా వైరస్ చచ్చిపోతుందని అంతా నమ్ముతున్నారు. దీనికి గ్యారెంటీ లేదు. ఎండమెక్ కరోనా వైరస్, ఇన్ ఫ్లూయెంజా లాంటివి చాలా ఏళ్లు బతికాయి’ అని న్యూజెర్సీ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ డేవిడ్ అన్నారు. ‘2009లో వెలుగులోకి వచ్చిన హెచ్1ఎన్1 ప్యాండెమిక్ ఇన్ ఫ్లూయెంజా ఇంకా అక్కడక్కడ బయటపడుతూనే ఉంది. దానిలానే కరోనా వైరస్ మళ్లీ శీతాకాలంలో తిరిగి వస్తుంది’ అని మరో ప్రొఫెసర్ వెల్లడించారు. వేసవిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందదని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. చేయాల్సిందల్లా జనాల్లో అవగాహన కల్పించడమే అని వివరించారు.