పీక్‌లో కరోనా కేసులు.. మనిషి ప్రవృత్తితో మరోసారి వైరస్‌ విజృంభిస్తోంది!

  • Published By: srihari ,Published On : June 25, 2020 / 05:33 PM IST
పీక్‌లో కరోనా కేసులు.. మనిషి ప్రవృత్తితో మరోసారి వైరస్‌ విజృంభిస్తోంది!

కోవిడ్ -19 మహమ్మారితో ఆటలోద్దు.. మనిషి ప్రాణాన్ని తీసేస్తోంది. మహమ్మారి నుంచి నేర్చుకుంటుంది ఇదేనా? చాప కింద నీరులా రోజురోజుకీ కరోనా కేసులు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికా కూడా కరోనా దెబ్బకు విలవిల్లాడిపోయింది. 2019 చివరిలో చైనాలో ఉద్భవించినప్పటి నుంచి కోవిడ్ -19కి కారణమయ్యే కరోనావైరస్ అయిన SARS-CoV-2 గురించి ఎన్నో పరిశోధకులు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అసలు ఈ వైరస్ మూలం ఏంటో కూడా తెలియని పరిస్థితి. ఇది ఎలా వ్యాపించిందో తెలుసుకునేందుకు పలు పరిశోధనల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నారు. remdesivir, dexamethasone అనే రెండు డ్రగ్స్ కరోనా సోకిన రోగులలో కొంత ప్రయోజనాన్ని చూపుతాయని తెలుసుకున్నారు. కానీ, క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనడానికి ఇంకా తక్కువ అవకాశాలు ఉన్నాయి. 

కానీ కరోనా వైరస్ మానవ ప్రవృత్తిని తనకు అనుగుణంగా సద్వినియోగం చేసుకుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి విపత్తుగా మారిన చాలా కాలం తరువాత.. చాలామంది నిపుణులు ఇప్పుడు కరోనా విజృంభణ చూసి భయపడుతున్నారు. ఖచ్చితంగా చెప్పలేక పోయినప్పటికీ యుఎస్ మళ్ళీ విపత్తు దశకు చేరుకుందనే అభిప్రాయానికి వచ్చేశారు.  ఈ వైరస్ అంతర్ దృష్టిని సైతం ఛేదించగలదని జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కైట్లిన్ రివర్స్ అన్నారు. ప్రజలు వాస్తవానికి చూస్తున్నా దానికంటే కరోనా కేసుల్లో మార్పును ఆశిస్తున్నారు. వాస్తవానికి, మరణాల పెరుగుదల వలె కేసుల సంఖ్య పెరగడానికి మూడు వారాలు, కొన్నిసార్లు ఒక నెల కూడా పడుతుందని నిపుణులు అభిప్రయాపడుతున్నారు. 

ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్నదానికంటే టెక్సాస్, ఫ్లోరిడా, సౌత్ కరోలినా, ఉటా వంటి దేశాల్లో కరోనా కేసుల తీవ్రతను చూస్తున్న రాష్ట్రాల్లో భిన్నమైన కారణాలు ఉన్నాయి. ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. సగటున, తక్కువ మందికి తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారు. కరోనా పెరుగుదల మరణాల సంఖ్యలో ఏ విధంగానూ ప్రతిబింబించదని ఊహించటం కష్టమని వారి వాదన. ఈ నెలాఖరులో, 76,000 మంది న్యూయార్క్ వాసులు కరోనా బారినపడ్డారు. 17,000 మందికి పైగా మరణించారు. కేసులు 390,000కుపైగా పెరిగాయి, అంటువ్యాధి అదుపులోకి రాకముందే 25,000 మరణాలు నమోదయ్యాయి. 

2.4 మిలియన్ల మంది అమెరికన్లకు కోవిడ్ నిర్ధారణ అయింది. USలో ఈ కరోనావైరస్ కారణంగా 120,000 మందికి పైగా మరణించారు. వైరస్ ఇప్పటికీ అమెరికాలో ఉంది. కరోనా వ్యాప్తిపై నియంత్రణ సాధించిన అనేక ఇతర దేశాలు ఉన్నాయి. అవి మనకన్నా మంచి ప్రదేశంలో ఉన్నాయని చెబుతున్నారు. న్యూజిలాండ్, ఐస్లాండ్. కానీ జాబితాలో ఐరోపాలో ఎక్కువ భాగం ఉన్నాయి. ఇటలీ, స్పెయిన్, జర్మనీలు తీవ్రంగా దెబ్బతిన్న తరువాత కూడా కరోనా వ్యాప్తిని నియంత్రించాయి.

ఇందులో పరిష్కారాలు మొదటి నుంచి ప్రజారోగ్య నిపుణులు సిఫారసు చేసినవే ఉన్నాయి. పరీక్షల లభ్యత, వేగాన్ని మరింత పెంచుతాయి. కరోనా సోకిన వారిని వేరుచేయడం వల్ల మరొకరికి వైరస్ సోకదు. సామాజిక దూరాన్ని పాటించడం, రద్దీని నివారించడం, ఇతర వ్యక్తులతో సన్నిహిత సంబంధాలను తగ్గించడం, తరచుగా చేతులు కడుక్కోవడం, ఫేస్ మాస్క్‌లు ధరించడం వంటి చర్యల ద్వారా కరోనా వ్యాప్తిని తగ్గిస్తాయని, వైరస్‌ను అదుపులో ఉంచడానికి సాయపడతాయని చాలా మంది నిపుణులు ఇప్పటికీ అంగీకరిస్తున్నారు.