Covid-19: కోవిడ్ మానవ సృష్టే.. చైనా ల్యాబ్‌లోనే తయారీ.. వెల్లడించిన వుహాన్ ల్యాబ్ సైంటిస్ట్

కోవిడ్ వైరస్ విషయంలో చైనా పాత్ర మరోసారి వెలుగు చూసింది. చైనాలోని వుహాన్ ల్యాబొరేటరీలోనే కోవిడ్ వైరస్ తయారు చేసినట్లు తాజాగా ఒక సైంటిస్ట్ వెల్లడించాడు. ప్రమాదవశాత్తు ల్యాబ్‌లో ఈ వైరస్ లీకై, ప్రపంచమంతా వ్యాపించిందన్నాడు.

Covid-19: కోవిడ్ మానవ సృష్టే.. చైనా ల్యాబ్‌లోనే తయారీ.. వెల్లడించిన వుహాన్ ల్యాబ్ సైంటిస్ట్

Covid-19: అందరూ నమ్ముతున్నట్లుగా కోవిడ్ మనిషి సృష్టించిందేనా? ఈ వైరస్‌ను ల్యాబ్‌లోనే తయారు చేశారా? అంటే.. నిజమే అనేందుకు మరో ఆధారం దొరికింది. కోవిడ్ వైరస్‌ను చైనాలోని వుహాన్ ల్యాబొరేటరీలోనే తయారు చేసినట్లు తాజాగా ఒక సైంటిస్ట్ వెల్లడించాడు.

IT Raids: తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు.. వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ ఇండ్లలో తనిఖీలు

రెండున్నరేళ్లక్రితం కోవిడ్ వ్యాపించినప్పుడు ఇది మనిషి.. ల్యా‌బ్‌లో తయారు చేసిందేనని, చైనాలోనే దీన్ని తయారు చేశారనే ప్రచారం మొదలైంది. ప్రమాదవశాత్తు వైరస్ లీక్ కావడం వల్ల ఇది వ్యాపించిందని అనేక దేశాలు ఆరోపించాయి. అయితే, చైనా దీన్ని కొట్టిపారేసింది. కోవిడ్ వైరస్ విషయంలో అనేక కట్టుకథలు చెప్పింది. గబ్బిలాల నుంచి ఈ వైరస్ మనిషికి సోకినట్లు చెప్పింది. అయితే, చైనా చెప్పిన ఈ మాటలు అబద్ధమని తాజాగా తేలింది. ఈ వైరస్‌ను చైనాకు చెందిన వుహాన్‌లోని ఒక ల్యాబొరేటరీలో తయారు చేసినట్లు ఆండ్రూ హఫ్ అనే అమెరికన్ సైంటిస్ట్ వెల్లడించాడు. ఆయన ఈ ల్యాబొరేటరీలోని వైరాలజీ విభాగంలో కొంతకాలం పని చేశాడు. ‘ద ట్రూత్ అబౌట్ వుహాన్’ అనే పుస్తకంలో ఈ విషయం వెల్లడించాడు. ఈ ల్యాబ్ చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది.

Aam Aadmi Party: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ‘ఆప్’దే హవా.. 15 ఏళ్ల బీజేపీ ఆధిపత్యానికి చెక్

అయితే, దీనికి అమెరికా నిధులు సమకూర్చింది. హఫ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. వుహాన్ ల్యాబ్‌లలో చైనా అనేక పరిశోధనలు చేస్తుంది. అయితే, ఈ విషయంలో సరైన భద్రతా చర్యలు తీసుకోదు. ఈ కారణంగా ల్యాబ్‌లో కోవిడ్ వైరస్ లీకై.. అది ప్రపంచమంతా వ్యాపించింది. వుహాన్‌లో అనేక దేశాలు ల్యాబొరేటరీలు నిర్వహిస్తున్నాయి. నిధులు అందిస్తున్నాయి. కానీ, వీటిపై ఆయా దేశాలకు పూర్తిస్థాయి నియంత్రణ ఉండదు. బయోసేఫ్టీ, బయో సెక్యూరిటీ, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటివి ఇక్కడ పాటించరు. దీంతో నిర్లక్ష్యం, సరైన భద్రతా చర్యలు తీసుకోని కారణంగా వైరస్‌లు లీకవుతున్నాయి. కోవిడ్ వైరస్‌కు సంబంధించి చైనాకు అన్ని వివరాలు తెలుసు. అమెరికాయే ఈ వైరస్‌ను చైనాకు అందించింది. వాళ్లు అక్కడ పరిశోధనలు చేసి బయో వెపన్స్ అందించాలనుకున్నారు.