కొవిడ్ పేషెంట్లలో ప్రతి ఐదుగురిలో ఒక్కరికి సుదీర్ఘ కాలం పాజిటివ్ లక్షణాలు

కొవిడ్ పేషెంట్లలో ప్రతి ఐదుగురిలో ఒక్కరికి సుదీర్ఘ కాలం పాజిటివ్ లక్షణాలు

Covid: కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ప్రతి ఐదుగురిలో ఒక్కరికి సుదీర్ఘ కాల పాటు లక్షణాలు కనిపిస్తున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. గతంలో ఊహించిన దానికంటే రెట్టింపు ఫలితాలు వస్తుందటంతో నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లాండ్‌లో లక్షా 86వేల మందికి చేసిన టెస్టుల్లో పాజిటివ్ రాగా.. వారానికి పైగా లక్షణాలు కనిపిస్తూ సుదీర్ఘ కాలంగా బాధపడుతున్నారు.

వారిలో కొందరు అంటే 11.5శాతం మాత్రం కొద్ది వారాల పాటు నీరసంగానే ఉంటుంటే 11.4శాతం మందికి దగ్గు, 10.1శాతం మందికి తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇదే కాక 8.2శాతం మందిలో ఎటువంటి రుచి లేకపోవడం, 7.9శాతం మందికి వాసన గ్రహించలేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తూనే ఉన్నాయని నేషనల్ స్టాటిస్టిక్స్ చెబుతుంది.

లాంగ్ కొవిడ్ గురించి విడుదల చేసిన డేటాలో అఫీషియల్ బాడీ ఈ సమాచారం బయటపెట్టింది. ఓఎన్ఎస్ నేషనల్ ఇన్ఫెక్షన్ సర్వే నుంచి తెలుసుకున్న వివరాల ప్రకారం.. హాస్పిటల్ లో ఉన్న పేషెంట్లు, కేర్ హోమ్స్, జైలులో బాధపడుతున్న రోగుల నుంచి కూడా వివరాలు సేకరించారు.

హాస్పిటల్ డేటా, డెత్స్, టెస్టింగ్ ఫిగర్స్, జీపీ రికార్డ్స్ లను ఇన్వెస్టిగేట్ చేసిన ఓఎన్ఎస్.. డయాబెటిస్, కార్డియోవాస్క్యులర్, కిడ్నీ, లివర్ సమస్యలు ఉన్న వారు సుదీర్ఘ కాలం ఇబ్బంది పడుతున్నట్లు చెప్పింది. మామూలు వారికంటే కరోనావైరస్ ఉన్న వారికి హార్ట్ అటాక్, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్ వంటికి 12రెట్లు ఎక్కువగా ఉండే రిస్క్ లు ఉన్నాయని చెబుతున్నాయి.

కొవిడ్ వార్డుల నుంచి సేకరించిన డేటా ప్రకారం.. ఇది కేవలం శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్ మాత్రమే కాదు. మల్టీ సిస్టమ్ డిసీజ్. కొన్నిసార్లు దురదృష్టవశాత్తు దీని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఎక్కువే. దీని గురించి నాలెడ్జ్ బేస్ ఉండటంతో పాటు ఎఫెక్టివ్ ట్రీట్‌మెంట్ స్ట్రాటజీలు ఉండాలి. రోగి పరిస్థితిని బట్టి నీరసం, కండరాల నొప్పులు, జ్వరం వంటి వాటిని గమనించి ట్రీట్‌మెంట్ అందించే విధానం తెలుసుకోవాలి’ అని నిపుణులు అంటున్నారు.

ఫ్లూ, కరోనావైరస్ తర్వాత లక్షణాలు కంటిన్యూ అవడమనేది కామన్.. కాబట్టి వైరస్ నెగెటివ్ వచ్చినంత మాత్రాన తగ్గిపోయిందని భావించి నిర్లక్ష్యం వహించకండి. ఇది పబ్లిక్ హెల్త్ పై ప్రభావం చూపించొచ్చు. ఈ రీసెర్చ్ సహకారంతో ప్రజల్లో మరింత సపోర్ట్ తీసుకురావచ్చని నిర్వాహకులు అంటున్నారు.