Omicron Variant: పాకిస్తాన్‌లో ఫస్ట్ ఒమిక్రాన్‌ కేసు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దక్షిణాఫ్రికాలో కనిపించిన ఈ కొత్త వేరియంట్ వేగంగా ఇతర దేశాలకు కూడా వ్యాపించింది.

Omicron Variant: పాకిస్తాన్‌లో ఫస్ట్ ఒమిక్రాన్‌ కేసు

Omicron

Omicron Variant: ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దక్షిణాఫ్రికాలో కనిపించిన ఈ కొత్త వేరియంట్ వేగంగా ఇతర దేశాలకు కూడా వ్యాపించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం..
ఇప్పటివరకూ 63 దేశాల్లో కరోనా వేరియంట్ వ్యాపించింది. పాకిస్తాన్‌లో కూడా ఒమిక్రాన్ వ్యాపిస్తోంది. తొలి ఒమిక్రాన్ కేసు నమోదైనట్టు అధికారులు నిర్ధారించారు. కరాచీకి చెందిన మహిళకు ఒమిక్రాన్ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ మేరకు
పాకిస్తాన్‌ నేషనల్ కమాండ్ అండ్ ఆపరేషన్ సెంటర్ (NCOC) వెల్లడించింది.

ఒమిక్రాన్‌ వ్యాపించిన మహిళ కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నట్టు గుర్తించారు. ఒమిక్రాన్‌ సోకిన ఆగాఖాన్ యూనివర్శిటీకి చెందిన మహిళ.. కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరింది. ఆమె నుంచి శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్ కు పంపారు. ఆ రిపోర్టులో బాధిత మహిళకు ఒమిక్రాన్ వేరియంట్‌ సోకినట్టు నిర్ధారణ అయిందని ఇస్లామాబాద్‌కు చెందిన NCOC ఒక ప్రకటనలో వెల్లడించింది.

ప్రస్తుతం బాధితురాలను ఇంటికి పంపించగా ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని, ఇతరుల సాయం లేకుండానే తన పనులు తానే చేసుకోగలుగుతుందని NCOC పేర్కొంది. మరోవైపు భారతదేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.

Read Also : Omicron Detection : పంటినొప్పి చికిత్స కోసం వెళ్లిన 12ఏళ్ల బాలికకు ఒమిక్రాన్!