Cow Escapes : వండర్.. క‌బేళా నుంచి త‌ప్పించుకుని 800 కిమీ ప్రయాణం చేసి ప్రాణాలు కాపాడుకున్న ఆవు

కబేళా నుంచి తప్పించుకున్న ఓ ఆవు ఏకంగా 800 కిమీ ప్రయాణం చేసి తన ప్రాణాలు కాపాడుకుంది. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. ఆ ఆశ్చర్యకర ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది.

Cow Escapes : వండర్.. క‌బేళా నుంచి త‌ప్పించుకుని 800 కిమీ ప్రయాణం చేసి ప్రాణాలు కాపాడుకున్న ఆవు

Cow Escapes

Cow Escapes : కబేళా నుంచి తప్పించుకున్న ఓ ఆవు ఏకంగా 800 కిమీ ప్రయాణం చేసి తన ప్రాణాలు కాపాడుకుంది. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. ఆ ఆశ్చర్యకర ఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది.

బ్రెజిల్‌లోని ఒక జంతు వధ కబేళా నుంచి తప్పించుకున్న ఆవు అక్కడి నుంచి రియో డి జనీరోకు పశ్చిమాన 800 కి.మీ దూరంలో ఉన్న నోవా గ్రెనడాలోని వాటర్ పార్క్‌లోకి ప్రవేశించింది. అక్కడ నుంచి నెమ్మదిగా ఓపెన్-ఎయిర్ స్విమ్మింగ్ పూల్‌కి చేరుకుని అక్కడున్న మెట్లు ఎక్కి నీటి స్లైడ్ పైకి చేరుకుంది. కానీ అక్కడ నడవలేక జారిపోయింది. దీంతో ఆ ఆవు అక్కడే కూర్చొండిపోయింది.

Old Age : వృద్ధుల్లో తిన్న ఆహారం ఎందుకు వంటపట్టదో తెలుసా?..

ఈ దృశ్యాల‌ను ఆ పార్క్ య‌జ‌మాని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సోష‌ల్ మీడియా ద్వారా ఆ ఆవు క‌బేళా నుంచి త‌ప్పించుకుని పారిపోయి వ‌చ్చిన‌ట్టుగా గుర్తించాడు. కాగా, ఆ ఆవుకు టొబొ అని నామ‌క‌ర‌ణం చేశాడు వాటర్ పార్క్ ఓనర్. ఆ ఆవును వాట‌ర్ పార్క్‌లోనే ఉంచాల‌ని టూరిస్టులు కోర‌డంతో అక్క‌డే ఉంచారు. ఇప్పుడు ఆ పార్క్‌లో ఆ ఆవు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచింది. వాటర్ పార్కులో గోవుకి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

Read More..Pollution : ఫైవ్ స్టార్ హోటల్స్‌‌లో ఉంటూ రైతులపై విమర్శలా ? కాలుష్యంపై జస్టిస్ ఎన్వీ రమణ సీరియస్

నిజానికి ఆ స్విమ్మింగ్‌ పూల్‌ 200 కేజీల బరువును మాత్రమే మోయగలదు. కానీ 317 కిలోలు ఉన్న ఆవు ఎక్కినప్పుడు ఆ పూల్‌ పైభాగం ఏ మాత్రం ధ్వంసం కాలేదు. తన ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ ఆవు 800 కిమీ ప్రయాణం చేసిందనే వార్త ఇప్పుడు అందరిని విస్మయానికి గురి చేస్తోంది. ప్రాణాలను కాపాడుకునేందుకు ఆ ఆవు చేసిన ప్రయత్నం నెటిజన్లు హృదయాలు గెల్చుకుంది.