Cows toilet : టాయిలెట్‌ వాడుతున్న ఆవులు..మనుషుల కంటే జంతువులే నయమనిస్తున్నాయి.

ఆవులు టాయిలెట్ కు వెళ్లి మూత్ర విసర్జన చేస్తున్నాయి. ఆ ఆశుల్ని చూసైనా మనుషులు బహిరంగ మూత్ర విసర్జన చేయటం నేర్చుకోవాల్సిన అవసరముంది అనిపిస్తోంది.

10TV Telugu News

Cows toilet : బహిరంగ మూత్ర విసర్జన చేయవద్దని నెత్తీ నోరు మొత్తుకుంటున్నా కొంతమంది ఇప్పటికీ ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తునే ఉన్నారు.అటువంటివారిని చూస్తే ‘ఏరా నువ్వు మనిషివా పశువ్వా?’ అని అడగాలనిపిస్తుంది. కానీ పశువులతో అటువంటివారిని పోల్చకూడదు. ఎందుకంటే పశువులు కూడా టాయిలెట్‌ వాడుతున్నాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. జర్మనీలో ఆవులు మూత్ర విసర్జన కోసం టాయిలెట్‌ కు వెళ్లి బుద్ధిగా పనికానిస్తున్నాయి. మూత్ర విసర్జన కోసం అక్కడి ఆవులు టాయిలెట్‌ను వాడుతున్నాయి..! ఎక్కడపడితే అక్కడ మూత్ర విసర్జన కారణంగా కాలుష్యం పెరిగిపోతోందని..దాని నివారించటానికి సైంటిస్టులు ఆవులకు టాయ్ లెట్ వాడటాన్ని నేర్పించారు. అప్పటి నుంచి ఆవులు యూరిన్ వస్తే..చక్కగా టాయ్ లెట్ కు వెళ్లి మరీ పనికానిచ్చి వస్తున్నాయి.

Read more : International Dog Day : ప్రతీ కుక్కకు వచ్చిందో రోజు..ఇదే ఆరోజు..

ఆవుల కోసం ఏర్పాటు చేసిన జర్మనీ సైంటిస్టులు ప్రత్యేక టాయిలెట్‌ ఏర్పాటు చేశారు. అలా వాటికి మూత్రం వచ్చినప్పుడు టాయిలెట్‌ ఎలా వాడాలో ట్రైనింగ్ ఇచ్చారు. అలా అప్పటి నుంచి ఆవులు సైంటిస్టులు ఏర్పాటు చేసిన మూత్రశాలలోకే వెళ్లి మూత్రవిసర్జన చేస్తున్నాయి. ఇది వాతావరణానికి ఎంతో ప్రయోజకరమని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ అధ్యయనాన్ని జర్మనీలోని ఫార్మ్‌ ఎనిమల్ బయాలజీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ చేపట్టింది.

Read more : Animals Covid Vaccine : మనుషులకే కాదు జంతువులకూ కరోనా టీకా.. ఆ జూలోని పులులు, సింహాలకు వ్యాక్సిన్లు

గ్రీన్‌హౌజ్‌ గ్యాస్ కరెంట్ బయాలజీలో ప్రచురించిన పరిశోధన ప్రకారం..బహిరంగ ప్రదేశాల్లో జంతువుల విసర్జనను నిరోధించడం వలన అమ్మోనియాను పెరుగకుండా నిరోధించవచ్చు అని తేలింది. నేల సారవంతంపై అమ్మోనియా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. సూక్ష్మజీవుల సహాయంతో అమ్మోనియాను నైట్రస్ ఆక్సైడ్‌గా మార్చవచ్చు. కార్బన్ డయాక్సైడ్, మీథేన్ తర్వాత మూడవ అతి ముఖ్యమైన గ్రీన్‌హౌజ్‌ వాయువు. గ్రీన్ హౌజ్‌ వాయువులు ప్రధానంగా వాతావరణంలోని ఉష్ణోగ్రత పెరగడానికి కారణమవుతుంటాయి. అలా అమ్మోనియాను నిరోధించేందుకు ఆవుల కోసం ప్రత్యేక టాయిలెట్‌ను రూపొందించారు సైంటిస్టులు. ఆవు వ్యర్థాల నుంచి అమ్మోనియాను సేకరించి నేరుగా పర్యావరణంలోకి వ్యాపించకుండా నిరోధించవచ్చంటున్నారు పరిశోధకులు. ఈ ఆవుల టాయిలెట్ ఆలోచన కూడా అదే.

Read more : Otters : నాగార్జున సాగర్ జలాశయంలో నీటికుక్కల సందడి

పశువుల్లో ఆవు చాలా త్వరగా మనిషి మాటల్ని అర్థం చేసుకుంటుంది. ఆవు మనిషి నుంచి త్వరగా నేర్చుకునే గుణాలను కలిగి ఉంది. అందుకే ఆవులపై ఇటువంటి ప్రయోగం చేశామని వాటికి మూత్రం వచ్చినప్పుడు టాయిలెట్ కు వెళ్లి విసర్జన చేసేలా ట్రైనింగ్ ఇచ్చామని జేన్‌ లాంగ్‌బీన్‌ అనే సైంటిస్టు వెల్లడించారు.

తాము ఇచ్చిన ట్రైనింగ్ ను ఆవులు చాలా త్వరగా గ్రహించాయని అలా ట్రైనింగ్ పూర్తి చేసుకున్నప్పటినుంచి ఆవులు బుద్ధిగా బయట మూత్రవిసర్జన చేయకుండా వాటికోసం ఏర్పాటు చేసిన టాయిలెట్ కు వెళ్లి చేస్తున్నాయని తెలిపారు.కొన్ని వారాల శిక్షణ అనంతరం 16 ఆవుల్లో 11 ప్రత్యేకంగా తయారుచేసిన ‘మూలు’ టాయిలెట్‌ను వినియోగించుకోగలిగాయని ఆయన తెలిపారు. పశువులకు ఒక్కసారి అర్థం అయ్యేలా ట్రైనింగ్ ఇస్తే మనుషుల కంటే జంతువులే నయం అనేలా ఆవులు చక్కగా టాయిలెట్ ను వాడుతున్నాయి.

మరి మనిషి నుంచి జంతువు నేర్చుకోవటం కాదు జంతువుల నుంచే మనుషులు నేర్చుకోవాలని అనిపిస్తోంది కదూ..రోడ్ల పక్కనా..ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేసేవాళ్లకు ఇదిగో ఆ ఆవుల్ని చూపించాలి. అప్పుడైనా వారికి బుద్ధి వస్తుందేమో.