Cristiano Ronaldo : నీళ్లు తాగాలన్న రొనాల్డో..Coca-Colaకి 4 బిలియన్ డాలర్ల నష్టం

పోర్చుగల్ ఫుట్ బాల్ టీమ్ కెప్టెన్ మరియు స్టార్ ఫుట్ బాలర్ గా పేరుపొందిన క్రిస్టియానో రొనాల్డో(36) మైదానంలోనే కాదు బయట కూడా ఏది చేసినా సంచలనమే.

Cristiano Ronaldo : నీళ్లు తాగాలన్న రొనాల్డో..Coca-Colaకి 4 బిలియన్ డాలర్ల నష్టం

Cristiano Ronaldo

Cristiano Ronaldo పోర్చుగల్ ఫుట్ బాల్ టీమ్ కెప్టెన్ మరియు స్టార్ ఫుట్ బాలర్ గా పేరుపొందిన క్రిస్టియానో రొనాల్డో(36) మైదానంలోనే కాదు బయట కూడా ఏది చేసినా సంచలనమే. తాజాగా ఓ మీడియా సమావేశంలో రొనాల్డో ఇచ్చిన ఓ చిన్న సందేశం..ఓ కంపెనీకి 4 బిలియన్ డాలర్లు నష్టం తెచ్చిపెట్టింది. అసలు రొనాల్డో ఇచ్చిన ఆ సందేశమేంటీ? ఆయన సందేశంతో నష్టపోయిన ఏ కంపెనీకి ఇంతలా నష్టం వచ్చిందో చూడండి.

గతేడాది జూన్ లో జరగాల్సి ఉన్న యూరో 2020 ఫుట్ బాల్ టోర్నమెంట్ కరోనా నేపథ్యంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది జూన్-11 న ఈ టోర్నమెంట్ ప్రారంభమైంది. యూరప్ లోని 11 నగరాల్లో ఈ టోర్నమెంట్ జులై-11 వరకు జరుగుతుంది. అయితే మంగళవారం యూరో 2020లో భాగంగా హంగేరితో మ్యాచ్ కు ముందు క్రిస్టియానో రొనాల్డో తన టీమ్ తరపున మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అయితే ఈ మీడియా సమావేశంలో తన ఎదురుగా ఉన్న టేబుల్ పై ఉన్న రెండు కోకో కోలా బాటిల్స్ ను పక్కకు జరిపిన రొనాల్డో..కోకోకోలాకి బదులుగా మంచినీళ్లు తాగాలంటూ ఓ వాటర్ బాటిల్ ను పైకెత్తి చూపించాడు.

అయితే యూరో 2020కి కోకోకోలా కంపెనీ కూడా ఒక స్పాన్సర్ గా ఉన్నప్పటికీ..రొనాల్డో కోకోకోలాను పక్కకు పెట్టేయడం అక్కడున్న అందరినీ ఆశ్చర్చపర్చింది. గ్లోబల్ ఫుట్ బాల్ స్టార్ చేసిన ఈ చర్య ఫలితంగా..కోకోకోలా కంపెనీ షేర్ల ధరలు భారీగా పడిపోయి.. కంపెనీకి 4 బిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. 242 బిలియన్ డాలర్లుగా ఉన్న కోకోకోలా మార్కెట్ విలువ 238 బిలియన్ డాలర్లకు పడిపోయింది. క్రిస్టియన్ రొనాల్డ్ కోకోకోలా బాటిల్స్ ను పక్కకు పెట్టేసిన వీడియో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. క్రిస్టియన్ రొనాల్డ్-కోకోకోలాపై ఫన్నీ మీమ్స్ ను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఇక,రొనాల్డో చర్యపై కోకోకోలా స్పందించింంది. ప్రజలుకు వేర్వేరు టెస్ట్ లు,అవసరాలు ఉంటాయి కాబట్టి వాళ్లు తమ ప్రాధాన్యత ఆధారంగా ఏ డ్రింక్ తాగాలనేది నిర్ణయించుకుంటారని ఓ ప్రకటనలో కోకోకోలా పేర్కొంది.