ఐసీయూ వార్డులో పక్క కొవిడ్ బెడ్‌పై ఉన్న తల్లికి లాస్ట్ గుడ్ బై

ఐసీయూ వార్డులో పక్క కొవిడ్ బెడ్‌పై ఉన్న తల్లికి లాస్ట్ గుడ్ బై

final goodbye to mum lying next in Covid icu: పక్క బెడ్‌పై ఉన్న తల్లికి ఫైనల్ గుడ్ బై చెప్పేసింది ఆ కూతురు. ఐసీయూలో చేరిన కూతురు పక్క బెడ్‌పై ఉన్న తల్లి మరికొద్ది రోజులు మాత్రమే బతుకుతుందని తెలిసి చేతులతోనే తాకి ఫైనల్ గుడ్ బై చెప్పింది. అనాబెల్ శర్మ 49, మారియా రికో 76 కొవిడ్ తో బాధపడుతూ.. అక్టోబర్ లో హాస్పిటల్ లో చేరారు.

రెండు వారాల తర్వాత ఆక్సిజన్ అందడం లేదని ఇద్దరినీ ఐసీయూ వార్డుకు షిఫ్ట్ చేశారు. అక్కడే ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న కూతురికి తెలిసింది ఆమె తల్లి ఇంకొన్ని రోజులు మాత్రమే బతకగలదని. దాంతో ఆమె పక్క బెడ్ కు మార్పించుకుంది. ఆ బాధను మరోలా చెప్పలేదు. గుండెకు హత్తుకుని ఏడవలేదు. సాధ్యమైనంత సేపు చేతిలో చెయ్యి పెట్టి అలా పట్టుకుని ఉంది.

mother daughter covid

పక్క బెడ్ మీద ఉన్న తల్లి 24గంటలు మాత్రమే ప్రాణాలతో ఉంది. నవంబర్ 1న తల్లి చనిపోయిందంటూ హాస్పిటల్ లో తీసుకున్న ఫొటోను చూస్తూ చెప్పింది అనాబెల్. ‘ఇంటెన్సివ్ కేర్ లో జాయిన్ అయిన తర్వాత మా అమ్మను చూడటం అదే మొదటిసారి. తను ఏ మాట్లాడుతుందో కూడా తెలీదు. ఎందుకంటే తనకు మాస్క్ ఉంది. నాకు హెల్మెట్ ఉంది.

‘డాక్టర్ ఆమె ఏం చెప్తుందో విని తెలియజేయాలనుకుని ఫెయిల్ అయ్యారు. ఎలా అయితే మాకు పెట్టి ఉన్న ఆక్సిజన్ పైపులు తీసి మాట్లాడుకునేందుకు అవకాశం ఇచ్చారు. కానీ, అప్పటికి నాకు ఆక్సిజన్ చాలా తక్కువ స్థాయిలో మాత్రమే అందుతుంది. అంత్యక్రియలు, సమాధి అనే మాటలు మాత్రమే వినిపించాయి. పక్కనే ఉన్న డాక్టర్ నాకు చెప్పారు. మీ అమ్మ చనిపోతుంది. తను ట్రీట్‌మెంట్ ఆపేయమని సంతకం కూడా పెట్టింది.

నేను తనని అడిగాను. ఎందుకు అలా చేశావ్. సంతకం ఎందుకు పెట్టావ్ అని అడిగాను. మీ మిగిలిన కుటుంబ సభ్యులు తాను తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించారని డాక్టర్ చెప్పారు.

అనాబెల్ ఆస్తమాతో బాధపడుతూ తల్లి అంత్యక్రియలు కూడా హాస్పిటల్ బెడ్‌పై నుంచే స్క్రీన్ లో చూసింది. ఇప్పుడు కోలుకున్నప్పటికీ ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా డ్యామేజి కావడంతో ఆక్సిజన్ ఉంటేనే ఆమె బతుకుతుంది లేదంటే కష్టమే.