UK New Currency King Charles III Pic : అమ్మ పోయే కొడుకు వచ్చే.. కరెన్సీ నోట్లపై ‘బ్రిటన్‌ కింగ్‌’ ఛార్లెస్‌ III ఫోటో

బ్రిటన్ లో కొత్త కరెన్సీ అందుబాటులోకి రానుంది. యునైటెడ్ కింగ్ డమ్ రాణి ఎలిజబెత్ మరణంతో ఆమె కుమారుడు కింగ్ చార్లెస్ III ముఖ చిత్రంతో ఈ కొత్త కరెన్సీ అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి కొత్త కరెన్సీ నోట్ల నమూనాను బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ విడుదల చేసింది.

UK New Currency King Charles III Pic : అమ్మ పోయే కొడుకు వచ్చే.. కరెన్సీ నోట్లపై ‘బ్రిటన్‌ కింగ్‌’ ఛార్లెస్‌ III ఫోటో

UK New Currency King Charles III Pic

UK New Currency King Charles III Pic : బ్రిటన్ లో కొత్త కరెన్సీ అందుబాటులోకి రానుంది. యునైటెడ్ కింగ్ డమ్ రాణి ఎలిజబెత్ మరణంతో ఆమె కుమారుడు కింగ్ చార్లెస్ III ముఖ చిత్రంతో ఈ కొత్త కరెన్సీ అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి కొత్త కరెన్సీ నోట్ల నమూనాను బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ విడుదల చేసింది. క్వీన్ ఎలిజబెత్ II హయాంలో ఆమె ముఖ చిత్రంతోనే బ్రిటన్ కరెన్సీ ఉండేది. ఆమె మరణం తరువాత ఆమె కుమారుడు కింగ్ చార్లెస్ III ముఖ చిత్రంతో కొత్త కరెన్సీ నోట్లు త్వరలో అధికారికంగా రానున్నాయి. ఈ కొత్త కరెన్సీ నోట్ల నమూనాను బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ మంగళవారం (డిసెంబర్ 20,2022)విడుదల చేసింది.

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ II మరణం తర్వాత 74 ఏళ్ల కింగ్‌ ఛార్లెస్‌ III బాధ్యతలు చేపట్టారు. దీంతో ఇక అంతా కింగ్ మార్కుతోనే పాలన నడుస్తుంది. దీంట్లో భాగంగానే బ్రిటన్ కరెన్సీ కూడా మారుతుంది. తాజాగా రాజు ఫొటోతో కొత్త కరెన్సీ నోట్లు అక్కడ చెలామణిలోకి రానున్నాయి. ఈ కొత్త నోట్లు అధికారికంగా బయటకు వచ్చి చెలామణిలోకి రావాటానికి ఇంకా ఏడాది సమయంలో పట్టేలా ఉంది. అంటే ఈ కొత్తనోట్లు (కింగ్ చార్లెస్ ఫోటో కరన్సీ)2024లో నుంచి చెలామణిలోకిరానున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా 5, 10, 20, 50 పౌండ్ల నోట్లపై కింగ్‌ ఛార్లెస్‌ చిత్రంతో వాటిని ముద్రిస్తున్నారు. నమూనా నోట్లను బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ విడుదల చేసింది. ఈ కొత్త కరన్సీ 2024 నుంచి చలామణిలోకి వస్తాయని.. పాత నోట్లు (క్వీన్ ఎలిజబెత్ ఫోటోతో ఉన్న పాతనోట్లు) కూడా చెల్లుబాటు అవుతాయని వెల్లడించింది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే..ఈ కరన్సీలో ఒక్క ఎలిజెబెత్ రాణి ఫోటోకు బదులగా కింగ్ చార్లెస్ ఫోటో ఒక్కటే మారనుంది. మిగతా డిజైన్ అంతా యథావిధిగా ఉంటుంది.

ఈ కొత్త నోట్ల విడుదలపై బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ గవర్నర్‌ ఆండ్రూ బైలీ మాట్లాడుతూ..‘కింగ్‌ ఛార్లెస్‌ III చిత్రంతో కూడిన బ్యాంకు నోట్లను విడుదల చేయడం గర్వంగా ఉంది అని అన్నాను. నోట్లపై కనిపించే రెండో రాజు కింగ్ చార్లెస్ మాత్రమేనని..అందుకే ఇది ఎంతో అపురూపమైన క్షణం అని తెలిపారు. 2024లో ఇవి చలామణిలోకి రానున్నాయని..వీటితోపాటు రాణి చిత్రం ఉన్న నోట్లు కూడా వినియోగంలో ఉంటాయని తెలిపారు. కాగా..బ్రిటన్‌లో గతంలో బ్యాంకు నోట్లను పేపర్‌తో తయారు చేయగా.. కొంత కాలంగా పాలిమర్‌ కరెన్సీ నోట్లను ముద్రిస్తున్నారు.